డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో.. నలుగురు అరెస్ట్

డాక్టర్  ప్రత్యూష ఆత్మహత్య కేసులో.. నలుగురు అరెస్ట్

హసన్ పర్తి, వెలుగు : డాక్టర్  ప్రత్యూష ఆత్మహత్య కేసులో మృతురాలి భర్త డాక్టర్  అల్లాడి సృజన్ తో పాటు సోషల్  మీడియా ఇన్ఫుయెన్సర్  బాణోత్ శ్రుతి, అత్తమామలు అల్లాడి మధుసూదన్, అల్లాడి పుణ్యవతిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం హసన్ పర్తి పోలీస్ స్టేషన్​లో మీడియాకు వివరాలు వెల్లడించారు. 8 నెలల నుంచి సృజన్  సోషల్  మీడియాలో పరిచయమైన బాణోత్  శ్రుతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 

ఈ విషయం తెలిసిన ప్రత్యూష నిలదీస్తే, కొట్టడంతో పాటు విడాకులు ఇస్తానని బెదిరించేవాడు. అత్తమామలకు ఈ విషయం చెప్పినా వారు కొడుకును వెనకేసుకొని వస్తూ ప్రత్యూషను హింసించేవారు. శ్రుతి కూడా ప్రత్యూషకు ఫోన్  చేసి బెదిరించేది. ఈ నలుగురి వేధింపులు తట్టుకోలేక డాక్టర్  ప్రత్యూష సూసైడ్​ చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.