అనుకూలించని వాతావరణం.. ఫ్లైట్ల దారి మళ్లింపు..

అనుకూలించని వాతావరణం.. ఫ్లైట్ల దారి మళ్లింపు..

హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. శంషాబాద్ లోనూ గాలులతో పాటు వాన పడటంతో విమానాల ల్యాండింగ్ వాతావరణం అనుకూలించలేదు. దీంతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సిన పలు ఫ్లైట్లను దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఫ్లైటును బెంగళూరుకు, ముంబై నుంచి హైదరాబాద్, వైజాగ్ నుంచి హైదరాబాద్కు రావాల్సిన విమానాలను విజయవాడకు పంపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ మధ్య నడిచే విమాన సర్వీసును నాగపూర్కు మళ్లించారు.