- సీఎం భూపేంద్ర పటేల్ అత్యవసర సమీక్ష
అహ్మదాబాద్: ఆసియా సింహాలకు ఏకైక నివాస స్థానమైన గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతంలో నాలుగు సింహం పిల్లలు మరణించాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా మరో 17 పెద్ద సింహాలను అధికారులు ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. సింహం పిల్లల మృతిపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గాంధీనగర్‌లో అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
సింహం పిల్లల మరణానికి గల కారణాలపై అటవీ శాఖ మంత్రి అర్జున్ మోద్వాడియా స్పందించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సింహం పిల్లలు ‘బాబేసియా’ (జంతువుల ఒంటిపై ఉండే పేల ద్వారా వ్యాపించే) ఇన్ఫెక్షన్ కారణంగా మరణించినట్టు అనుమానిస్తున్నామని తెలిపారు. మిగిలిన మూడు పెద్ద సింహాలు పరస్పర దాడులు, వృద్ధాప్యం వంటి కారణాల వల్ల చనిపోయాయని ఆయన చెప్పారు.
