భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లోని బీజాపూర్నేషనల్పార్కులో శనివారం జరిగిన ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. మృతులు నేషనల్ పార్కు ఏరియా చీఫ్ దిలీప్ వెండ్జా, ఏరియా కమిటీ సభ్యుడు కోసా మాండవిగా, మరో మహిళ, పురుషుడిని గుర్తించినట్టు బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మహారాష్ట్ర బార్డర్లోని బీజాపూర్జిల్లా నేషనల్ పార్కు లోకి వచ్చి.. దండకారణ్యం స్పెషల్ జోనల్కమిటీ ఇన్ చార్జ్ పాపారావు నేతృత్వంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు కూంబింగ్చేపట్టాయి. ఎస్పీ జితేంద్ర యాదవ్ నేతృత్వంలో బలగాలు నేషనల్ పార్కులోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని కండాలాపర్తి, సక్మెటా అడవులను చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. ఒక్కసారిగా మావోయిస్టులు అలర్టై బలగాలపై కాల్పులకు దిగారు. అనంతరం అడవుల్లోకి పారిపోతుండగా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో రెండు డెడ్ బాడీలను, రెండు ఏకే-47 రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలతో అడవులను గాలిస్తున్నాయి.
