దోమల మందు బాటిల్ పేలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి

దోమల మందు బాటిల్ పేలి  ఒకే కుటుంబంలో నలుగురు మృతి

తమిళనాడులోని మనలీలో విషాదం చోటుచేసుకుంది.  ఓ ఇంట్లో  దోమల మందు బాటిల్ పేలడంతో ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు.  మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు.  దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇంట్లో దోమల కోసం కరెంట్ ప్లగ్‌ లో లిక్విడ్ బాటిల్ పెట్టారు. అయితే.. అదే సమయంలో.. షాక్ సర్య్కూట్ తో ఒక్కసారి దోమల మందు లిక్విడ్ బాటిల్ పేలిపోయింది. ఈ పేలుడు వల్ల స్విచ్ కింద ఉన్న బట్టలకు మంటలు అంటుకున్నాయి. 

దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. లిక్వీడ్ సహా పొగ వల్ల ఊపిరి ఆడుకుండా నలుగురు చనిపోయారు.