
వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్ లో తీవ్ర విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం..స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లగానే అజీరాం బీ(63) ఆమె కూతురు ఆస్మా బేగం (35) అల్లుడు ఖాజా పాషా(42) మనవరాలు హసీనా(10) మృతదేహాలు ఇంట్లో ఒక్కోచొట ఒక్కొక్కరివి పడి ఉన్నాయి. కిచెన్ లో అజీరాం బీ మృతదేహం, హాలులో హసీనా, ఇంటి వెనుక గుంతలో ఖాజాపాషా, డైనింగ్ హాలులో ఆస్మా బేగం మృతదేహాలు పడి ఉన్నాయి. శుక్రవాం ఉదయంలో ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగానే నలుగురు మృదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
అసలు ఏం జరిగింది.?
అయితే ఇంట్లో నిమ్మకాయలు,పసుపు,కుంకుమ,కొబ్బరికాయ, ఇంటివెనుక గోతి తవ్వి ఉండటం, ఒకేసారి నలుగురు చనిపోవడం పలు అనుమానాలు కల్గిస్తున్నాయి. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. వీరిని ఎవరైనా హత్య చేశారా? లేదా ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.