ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

V6 Velugu Posted on Apr 15, 2021

విశాఖ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఆదిత్య టవర్స్‌లోని ఎన్ఆర్ఐ ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు థాటికి నలుగురు సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని తెలుస్తోంది.

మిథిలాపురి కాలనీ, అపార్ట్‌మెంట్‌లోని‌ ఐదో అంతస్తులో 8 నెలల నుంచి ఎన్ఆర్ఐ కుటుంబం నివసిస్తున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని బంగారు నాయుడు, డాక్టర్ నిర్మల, దీపక్ (22), కశ్యప్ (19)గా పోలీసులు నిర్ధారించారు. అయితే.. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురి మృతికి కారణం పాత కక్షలేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Tagged visakhapatnam, Four members

Latest Videos

Subscribe Now

More News