మరో నాలుగు రోజులు వానలు

మరో నాలుగు రోజులు వానలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మొదటి రెండు రోజుల పాటు దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని, ఆ తర్వాతి రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడే చాన్స్​ ఉందని పేర్కొంది. మరోవైపు టెంపరేచర్లు కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం నల్గొండ జిల్లా దామరచర్ల, కరీంనగర్​ జిల్లా వీణవంకలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే, వర్షాల ప్రభావంతో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.