జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక

జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక

చిట్యాల, వెలుగు: తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  వికారాబాద్ జిల్లా తాండూరు సెయింట్ మార్క్స్ పాఠశాలలో ఆదివారం ఐదో సౌత్ జోన్ షూటింగ్ బాల్ సెలక్షన్స్​నిర్వహించారు. నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. సీనియర్స్​విభాగంలో గంగపురం రాము(ఉరుమడ్ల), ఎలుగు చంద్రశేఖర్(చిట్యాల), జూనియర్స్​విభాగంలో ఎస్కే.నాగూర్ వలీ (నార్కట్ పల్లి), సబ్ జూనియర్స్​విభాగంలో గాదగోని నాగరాజు (చిట్యాల గ్రీన్ గ్రో పాఠశాల) ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

వీరు ఏపీలోని తిరుపతిలో  ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో జరగనున్న జాతీయ పోటీల్లో పాల్గొననున్నారు. క్రీడాకారులను తాండూర్ డీఎస్పీ నర్సింగ్​యాదయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు మంగళంపల్లి శ్రీనివాసులు, కార్యదర్శి ఐలయ్య, సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాము, సెక్రటరీ రాములు అభినందించారు.