‘బుల్ ఫైట్’లో కూలిన స్టేడియం గ్యాలరీ : నలుగురు మృతి

‘బుల్ ఫైట్’లో కూలిన స్టేడియం గ్యాలరీ : నలుగురు మృతి

సెంట్రల్ కొలంబియాలో జ‌రిగిన బుల్ ఫైట్‌లో విషాదం నెల‌కొంది. బుల్ ఫైట్ జరుగుతుండగా స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలి నలుగురు మృతిచెందారు. ఈ ఘ‌ట‌న‌లో 300 మంది వరకు గాయ‌ప‌డ‌గా, 30 మందికి పైగా తీవ్ర గాయాల‌య్యాయి. మృతిచెందిన‌ వారిలో ఇద్దరు మ‌హిళ‌లు, ఒక పురుషుడు, ఒక మైన‌ర్ ఉన్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 

టోలిమా రాష్ట్రంలోని ఎల్ ఎస్పినల్ నగరంలోని ఓ స్టేడియంలో ‘కొర్రలెజా’ అని పిలిచే సాంప్రదాయ క్రీడను (బుల్‌ఫైట్) నిర్వహించారు. దీనిలో పాల్గొనేవారు ఒక దున్నపోతును కవ్విస్తూ ఆడుతారు. ఈ ఆట జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలిపోయింది. సాన్ పెడ్రో అనే పండుగలో భాగంగా ఈ క్రీడను నిర్వహించారు. ఈ భ‌యాన‌క వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనుషులు, పశువులు ప్రాణాలు కోల్పోయే క్రీడలను అనుమతించవద్దని కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన గుస్తోవ్ పెట్రో అధికారులను ఆదేశించారు.