హైదరాబాద్: నగరంలో అతిపెద్ద కార్పొరేట్ క్రికెట్ సంబురం ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ (ఎఫ్‌పీఎల్) తొలి సీజన్ ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 26 వరకు హైదరాబాద్‌లో ఎనిమిది గ్రౌండ్స్‌లో జరగనుంది.
ఇండియాలో ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ వంటి రంగాలకు చెందిన 96 జట్లు, 1440 మంది ప్లేయర్లు ఇందులో పాల్గొననున్నారు. టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ‘ప్లే ఫర్ ఎ కాజ్’ అనే ఉదాత్తమైన భావనతో రూపొందిన ఈ లీగ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేట్ దిగ్గజాలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పారదర్శకమైన, వృత్తిపరమైన క్రీడా వేదికను అందించడమే లక్ష్యమని చైర్మన్ నంగి దేవేందర్ రెడ్డి, ప్రెసిడెంట్ డా. శ్రీప్రకాశ్ విన్నకోట పేర్కొన్నారు.
