ఫోర్బ్స్​ కుబేరుల లిస్ట్​లో నలుగురు తెలుగోళ్లు

ఫోర్బ్స్​ కుబేరుల లిస్ట్​లో నలుగురు తెలుగోళ్లు
  • 20వ ప్లేస్​లో మురళీ దివి..  ఆస్తి 45,460 కోట్లు
  • 43వ స్థానంలో డాక్టర్​ రెడ్డీస్​ ఫ్యామిలీ.. ఆస్తి 23,830 కోట్లు
  • మేఘా కృష్ణారెడ్డి ఫ్యామిలీకి 45వ ర్యాంకు
  • వాళ్ల ఆస్తులు 22,731 కోట్లు
  • కాళేశ్వరంతో పాటు మిషన్​ భగీరథ ప్రాజెక్టూ మేఘాకే
  • అరబిందో రాంప్రసాద్​కు 49వ ర్యాంకు.. ఆస్తి 22 వేల కోట్లు

న్యూఢిల్లీ: ఫోర్బ్స్​ ఇండియా టాప్​ 100 లిస్టులో నలుగురు తెలుగోళ్లకు చోటు దక్కింది. దివిస్​ లేబొరేటరీస్​ ఓనర్​ మురళీ దివి దేశంలోని సంపన్నుల జాబితాలో 20వ ర్యాంకు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల పరంగా చూస్తే ఆయనే నంబర్​ వన్​ సంపన్నుడిగా నిలిచారు. డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​ ఫ్యామిలీ (జాయింట్​గా) 43వ ర్యాంకు దక్కించుకుంది. మేఘా సంస్థ​ యజమాని పీపీ రెడ్డి కుటుంబం 45వ స్థానంలో నిలిచింది.

మేఘా కంపెనీని ప్రస్తుతం పీపీ రెడ్డి అల్లుడు పీవీ కృష్ణారెడ్డి నిర్వహిస్తున్నారు. ఫోర్బ్స్​ వరల్డ్​ లిస్టులో పీపీ రెడ్డితో పాటు పీవీ కృష్ణారెడ్డి కూడా చోటు దక్కించుకున్నారు. ఇక, అరబిందో ఫార్మా కో ఫౌండర్​ పీవీ రాంప్రసాద్​రెడ్డి దేశంలోని సంపన్నుల జాబితాలో 49వ స్థానాన్ని సంపాదించారు.

పీవీ రాంప్రసాద్ రెడ్డి

ఫోర్బ్స్​ ఇండియా ర్యాంక్​ 49;

వరల్డ్​ ర్యాంక్​ 1513

నికర ఆస్తులు దాదాపు రూ.22 వేల కోట్లు

(300 కోట్ల డాలర్లు)

అరబిందో ఫార్మా కంపెనీ కో ఫౌండర్​ పీవీ రాంప్రసాద్​ రెడ్డి. 1986లో కంపెనీని ఏర్పాటు చేశారు. షుగర్​, గుండె తదితర జబ్బులకు మందులను తయారు చేస్తున్నారు. కంపెనీ ఆదాయంలో 75 శాతం వరకు అమెరికా, యూరప్​ నుంచే వస్తోంది. రెగ్యులేటరీ అనుమతులను లేట్​ చేస్తుండడంతో ఈ ఏడాది ఏప్రిల్​లో శాండోజ్​ఓరల్​ సాలిడ్స్​, డెర్మటాలజీ బిజినెస్​ డీల్​ నుంచి సంస్థ తప్పుకుంది.

మురళీ దివి అండ్​ ఫ్యామిలీ

ఫోర్బ్స్​ ఇండియా ర్యాంకు 20;

వరల్డ్​ ర్యాంకు 538

నికర ఆస్తులు సుమారు రూ.45,460 కోట్లు(620 కోట్ల డాలర్లు)

దివిస్​ లేబొరేటరీస్​.. అతిపెద్ద బల్క్​ డ్రగ్​ తయారీ కంపెనీల్లో ఒకటి. రాష్ట్రంలోనే అతి పెద్దది. అమెరికాలో సైంటిస్టుగా ట్రె యిన్​ అయిన మురళి (69).. 30 ఏళ్ల క్రితం మందుల రీసెర్చ్​ కంపెనీగా దివిస్​ను ఏర్పాటు చేశారు. ఇప్పుడది యాక్టి వ్​ ఫార్మాస్యూటికల్​ ఇంగ్రెడియెంట్స్​ (ఏపీఐ– మందుల తయారీకి వాడే ముడి ఔషధం)ను ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. పెద్ద కంపెనీలకు మందులను కూడా తయారు చేసి ఇస్తోంది. న్యూట్రాస్యూటికల్స్​(విటమిన్​ సప్లిమెంట్లు, పోషకాలు, ఫోర్టిఫైడ్​ పాల ఉత్పత్తులు, సిరీల్స్​వంటివి)నూ ప్రొడ్యూస్​ చేస్తోంది. కంపెనీకి ఏటా వచ్చే ఆదాయంలో 80 శాతానికి పైగా విదేశీ ఎగుమతుల నుంచే వస్తోంది.

డాక్టర్​ రెడ్డీస్​ ఫ్యామిలీ

ఫోర్బ్స్​ ఇండియా ర్యాంక్​ 43;

నికర ఆస్తులు రూ.23,830 కోట్లు

(325 కోట్ల డాలర్లు)

డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​.. పసుపు రైతు కొడుకు అయిన దివంగత కె. అంజిరెడ్డి 1984లో జనరిక్స్​, ఫార్మా ఇంగ్రెడియెంట్స్​ తయారీ కోసం పెట్టిన కంపెనీ. ప్రస్తుతం కంపెనీని ఆయన కొడుకు సతీశ్​ రెడ్డి నిర్వహిస్తున్నారు. చైర్మన్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సతీశ్​ రెడ్డి అల్లుడు జీవీ ప్రసాద్​ కో చైర్మన్​గా ఉన్నారు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ మందులను తయారుచేస్తోంది రెడ్డీస్​. ప్రస్తుతం కరోనా కోసం ఫావిపిరావిర్​ మందునూ మార్కెట్​ చేస్తోంది. అందుకు జపాన్​కు చెందిన ఫ్యూజీఫిల్మ్​ తొయామా కెమికల్​తో ఒప్పందం కూడా చేసుకుంది. రష్యా వ్యాక్సిన్​ స్పుత్నిక్​ Vని ఇండియాలో మార్కెట్​ చేసేందుకు ఆ దేశానికి చెందిన సావరిన్​ వెల్త్​ ఫండ్​.. రెడ్డీస్​తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా 10 కోట్ల డోసులను దేశంలో డిస్ట్రిబ్యూట్​ చేయనుంది.

పీపీ రెడ్డి అండ్​ ఫ్యామిలీ

ఫోర్బ్స్​ ఇండియా ర్యాంక్​ 45;

వరల్డ్​ ర్యాంక్​ 1,335

నికర ఆస్తులు రూ.22,731 కోట్లు

(310 కోట్ల డాలర్లు)

ఫోర్బ్స్​ వరల్డ్​ లిస్టులో

పీపీ రెడ్డి ఆస్తులు రూ.11,732 కోట్లు

(160 కోట్ల డాలర్లు)

పీవీ కృష్ణా రెడ్డి ఆస్తులు రూ.11,732 కోట్లు (160 కోట్ల డాలర్లు-ర్యాంకు 1,335)

రైతు కుటుంబంలో పుట్టిన పీపీ రెడ్డి 1989లో మున్సిపాలిటీల కోసం చిన్న పైపులను తయారు చేసే మేఘా ఇంజనీరింగ్​ ఎంటర్​ప్రైజెస్​ అనే సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాత అతి తక్కువ కాలంలోనే వ్యాపారాన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులు, డ్యామ్​ల నిర్మాణం, సహజ వాయువు డిస్ట్రిబ్యూషన్​ నెట్​వర్క్స్​, పవర్​ ప్లాంట్లు, రోడ్ల నిర్మాణానికి విస్తరించారు. 1991లో కంపెనీ బాధ్యతలను ఆయన మేనల్లుడు పీవీ కృష్ణారెడ్డి చేపట్టారు. అప్పటి నుంచి ఆయనే కంపెనీని నిర్వహిస్తున్నారు. 2006లో కంపెనీ పేరును మేఘా ఇంజనీరింగ్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్స్​గా మార్చారు. 2014 తర్వాత కంపెనీ సంపద భారీగా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో రూ.లక్షా 2 వేల 666 కోట్లు విలువైన (ఫోర్బ్స్​ లెక్క ప్రకారం) కాళేశ్వరం ప్రాజెక్టును కడుతున్నది ఆ కంపెనీనే. మిషన్​ భగీరథ  పనులూ ఆ కంపెనీవే. ఏపీలో పట్టిసీమ ప్రాజెక్టుతో పాటు పోలవరం ప్రాజెక్టులోనూ కొన్ని పనులను దక్కించుకుంది. ఇప్పుడు సంగమేశ్వరం కాంట్రాక్టునూ సొంతం చేసుకుంది. అతి తక్కువ టైంలోనే ఇన్ని పెద్ద ప్రాజెక్టులు చేపట్టడంతో ఫ్యామిలీ ఆస్తులు భారీగా పెరిగాయి.