టీమ్ లో నలుగురు వికెట్ కీపర్లు.. ఇండియా అరుదైన రికార్డ్

టీమ్ లో నలుగురు వికెట్ కీపర్లు.. ఇండియా అరుదైన రికార్డ్

బంగ్లాదేశ్ తో వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. మ్యాచ్ కోసం ఎంపికైన తుది జట్టులో నలుగురు వికెట్ కీపర్లకు చోటు దక్కింది. మహేంద్రసింగ్ ధోనీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్.. ఇలా.. నలుగురు వికెట్ కీపర్లు ఒకే జట్టులో ఆడారు. ధోనీ రెగ్యులర్ వికెట్ కీపర్ కాగా… దినేష్ కార్తీక్ కూడా ప్రొఫెషనల్ వికెట్ కీపరే. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ కూడా అకేషనల్ గా వికెట్ కీపింగ్ చేస్తున్నవారే. ఐపీఎల్ లో రాహుల్, పంత్ వికెట్ల వెనుక, బ్యాట్ తోనూ తమ ప్రతిభ నిరూపించుకున్నారు. చెన్నైకి ధోనీ, ఢిల్లీకి పంత్, పంజాబ్ జట్టుకు రాహుల్, కోల్ కతా జట్టుకు దినేష్ కార్తీక్ వికెట్ కీపర్ గా వ్యవహరించారు.

అలా.. ధోనీ, రాహుల్, పంత్, కార్తీక్  ల రూపంలో నలుగురు వికెట్ కీపర్లు టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవడంపై అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

టీమిండియా లెజెండరీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ ఒకానొక దశలో విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు. వికెట్ కీపింగ్ చేసే సమర్థత కూడా అతడికి జట్టులో కొనసాగేందుకు అదనపు అర్హతయ్యింది. ప్రొఫెషనల్ కీపర్ ఎవరూ ఫామ్ లో లేకపోవడంతో… ద్రవిడ్ లాంటి ప్రొఫెషనల్ బ్యాట్స్ మన్ ను వికెట్ కీపర్ గా మార్చి కొన్నాళ్లు టీమిండియా బండి లాగించింది. అలాంటిది.. ఇపుడు అదే టీమిండియా జట్టులో నలుగురు వికెట్ కీపర్లు చోటు దక్కించుకోవడం విశేషంగా చెప్పుకుంటున్నారు అభిమానులు.