నాలుగేండ్ల చిన్నారి కిడ్నాప్.. 24 గంటల్లోనే కాపాడిన పోలీసులు

నాలుగేండ్ల చిన్నారి కిడ్నాప్.. 24 గంటల్లోనే కాపాడిన పోలీసులు

మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ పరిధిలోని కంచె ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న 4  ఏండ్ల చిన్నారి సఫియా బేగం శుక్రవారం మధ్యాహ్నం కిడ్నాప్ గురికావడం కలకలం రేపింది. 24 గంటల్లోనే ఈ కేసు సుఖాంతమైంది. టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫయాజ్ ఆధ్వర్యంలో 9 పోలీస్ బృందాలు సీసీ ఫుటేజీల ఆధారంగా గాలింపు చేపట్టారు. 

హకీంపేటకు చెందిన ఆటో డ్రైవర్ ఫయాజ్, భార్య సమ్రిన్ బేగం దంపతులే కిడ్నాపరులుగా గుర్తించారు. ఈ దంపతులు నాలుగేళ్ల క్రితం విడిపోయి మళ్లీ కలిసినప్పటికీ సంతానం లేకపోవడంతో మానసికంగా కుంగిపోయారు. సమ్రిన్ బేగం గతంలో గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టిన పాపే సఫియానేనని భ్రమించి, శుక్రవారం మధ్యాహ్నం ఆటోలో ఎత్తుకెళ్లారు. ఆటో నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం నిందితులను అరెస్ట్ చేసి పాపను కాపాడారు.