హైదరాబాద్ కోకాపేట భూములు భూములకు ఉన్న డిమాండ్ ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడా లేదు. వేలంలో HMDA కు కోట్లు కురిపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ.151 కోట్లు పలికి రికార్డు సృష్టించిన భూములు.. నాలుగో విడతలో కూడా భారీగా అమ్ముడుపోయాయి.
శుక్రవారం (డిసెంబర్ 05) కోకాపేట గోల్డెన్ మైల్ లోని 1.98 ఎకరాలకు ఈ వేలం వేశారు అధికారులు. వేలంలో ఎకరాకు రూ.77 కోట్ల 75 లక్షలకు దక్కించుకుంది COEUS ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సంస్థ.
ఇవాళ 1.98 ఎకరాలకు వేలంగా వేయగా.. రూ.154 కోట్లు పొందించినట్లు HMDA ప్రకటించింది. ఈసారి నాలుగు విడతల్లో విడతల్లో కోకాపేట లో 29 ఎకరాలకు 3,862 కోట్ల రూపాయలు పొందింది.
