ఫ్రాన్స్ లో లక్షకు పైగా కరోనా కేసులు

ఫ్రాన్స్ లో లక్షకు పైగా కరోనా కేసులు

యూరప్ దేశాలలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్​లో వరుసగా మూడో రోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దేశంలో శనివారం ఒక్కరోజే 1,04,611 మందికి కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు. కేసులు భారీగా పెరగడా నికి ఒమిక్రాన్ వ్యాప్తి కూడా కారణం కావొచ్చని భావిస్తున్నారు. దీంతో కరోనా కట్టడిపై చర్చించేందుకు సోమవారం హెల్త్ ఆఫీసర్లు, నిపుణులతో అత్యవసర భేటీ నిర్వహించేందుకు ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ రెడీ అవుతు న్నారు. మరోవైపు సెకండ్ డోస్ వేసుకుని మూడు నెలలు పూర్తి చేసుకున్నోళ్లంతా థర్డ్ డోస్ టీకాలు తీసుకోవాలని నిపుణులు సిఫారసు చేశారు. దీంతో థర్డ్ డోస్ తీసుకుంటేనే హెల్త్ పాస్ చెల్లుబాటు అయ్యేలా రూల్స్ మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశంలో కేఫ్​లు, రెస్టారెంట్లు, పబ్లిక్ ప్లేస్​లలోకి వెళ్లేందుకు, విదేశాలకు పోయేటందుకు ఈ హెల్త్ పాస్ లే కీలకం అయినందున ఈ కండీషన్​తో అందరూ థర్డ్ డోస్ వేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

పిల్లలకు టీకాలతో నో యూజ్: డాక్టర్ సంజయ్ కే రాయ్ 
పిల్లలకు కరోనా టీకాలు వేయడం వల్ల అదనంగా ఎలాంటి ప్రయోజనమూ ఉండదని ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కే రాయ్ అన్నారు. కొవాగ్జిన్‌‌ ట్రయల్స్​కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్​గా పనిచేసిన ఆయన.. పిల్లలకు టీకాలు వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సైంటిఫిక్​గాలేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని అమలుచేసే ముందు ఇప్పటికే పిల్లలకు టీకాలు వేసిన దేశాల నుంచి డేటా తెప్పించుకుని అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఆదివారం ప్రధాని ఆఫీసును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.