న్యూఢిల్లీ: భవిష్యత్తులో రష్యా, చైనా నుంచి ముప్పు ఉంటుందనే గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటున్నామని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెస్సెంట్ చేసిన కామెంట్లకు ఫ్రాన్స్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భవిష్యత్తులో ముప్పు పొంచి ఉంటుందనే సాకుతో ఇప్పుడు విధ్వంసం సృష్టించడం సరికాదని మండిపడింది. ‘‘ఒకవేళ ఏదో ఒకరోజు అగ్నిప్రమాదం జరిగితే ఫైర్‌ఫైటర్స్ వచ్చి ఆపుతారు.. ఫైర్ ఫైటర్స్ జోక్యం వద్దంటూ ఇప్పుడే ఇల్లును కాల్చేద్దాం.
ఒకవేళ ఏదో ఒకరోజు శత్రువు దాడిచేసే అవకాశం ఉంటే, మనల్ని కాపాడే వ్యవస్థ ఉంటుంది.. కానీ ఆ వ్యవస్థను మనమే నాశనం చేద్దాం. కారుకు ప్రమాదం జరిగితే నష్టపోతాం కాబట్టి ఇప్పుడే ఆ వాహనాన్ని ధ్వంసం చేద్దాం’’ అంటూ ఫ్రాన్స్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఈ పోస్టు పెట్టింది.
