సాగర్ శుద్ధి పేరుతో రూ.కోట్లు మాయం

సాగర్ శుద్ధి పేరుతో రూ.కోట్లు మాయం

హుస్సేన్‌ సాగర్‌ క్లీనింగ్‌ పేరిట వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. డబ్బులు మాత్రం హెచ్‌ఎండీఏ అధికారులు, కాంట్రాక్టర్లు మాయం చేస్తున్నారు. క్లీనింగ్‌ పేరిట హెచ్‌ ఎండీఏ వందల కోట్లు ఖర్చు చేస్తున్నా వ్యర్థాలు పోలేదు. రిజల్ట్‌‌ కనిపించడం లేదు. రోజు రోజుకు నీటిలో కాలుష్య కారకాలు పెరిగిపోతుండడంతో డేంజర్‌ లో పడిపోతోంది. హెచ్ఎండీఏ రూ. 300కోట్ల జైకానిధులను తీసుకొచ్చి క్లీనింగ్‌ కోసం ఖర్చు చేస్తోంది. అదేవిధంగా బెంగళూర్ బేస్డ్ సంస్థ నాకాఫ్‌ తో ఏడాది క్లీనింగ్ కాంట్రాక్ట్‌‌ గా రూ. 3.5 కోట్లకు అప్పగించగా, ఈ నెలాఖరులోగా కాంట్రాక్ట్ పూర్తి కానుంది. అయినా క్లీనింగ్‌ లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. కనీసం నీటిలో ఆక్సిజన్ లేని పరిస్థితికి చేరింది. డబ్బులు ఎటుపోతున్నాయని అధికారులను అడిగితే చెప్పడం లేదు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

 

హుస్సేన్ సాగర్ క్లీనింగ్.. హెచ్ఎండీఏ అధికారులకు కాసుల పంట గా మారింది. సాగర్ క్లీనింగ్ పేరుతో ఏళ్లకు ఏళ్లుగా హెచ్ఎండీఏ వంద లకోట్లు ఖర్చు చేసింది. మరి.. సాగర్ క్లీన్ అయిందాఅంటే హెచ్ఎండీఏ అధికారులే చెప్పలేని పరిస్థితి.సాగర్ శుద్ధి పేరుతో.. వందల కోట్లు దండుకుంటున్నారు. ఇటీవల ఎండలు ముదరడంతో సాగర్నుండి విపరీతంగా దుర్వాసన వెదజల్లుతోంది.

ప్రమాదంలో సాగర్
నిజాం కాలంలో సాగు, తాగునీటికి ఉపయోగకరంగా ఉండే హుస్సేన్ సాగర్.. ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. ప్రతీ రోజు వంద లాది మెట్రిక్ టన్నుల చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు,రసాయన కంపెనీల వ్యర్థాలు సైతం సాగర్ లోవచ్చి చేరుతున్నాయి. దీంతో సాగర్ కాలుష్య కాసారంగా మారింది. కనీసం సాగర్ నీటిలో.. ఆక్సిజన్ లేని పరిస్థితికి వచ్చింది. సిటీలో మంచి టూరిస్ట్ స్పాట్ గా వున్న హుస్సేన్ సాగర్ ను చూడానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. కానీ ప్రస్తుతం సాగర్ నుండి వస్తున్న దుర్వాసన టూరిస్టులను నిరాశకు గురిచేస్తోంది.

రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్నా..
పదేండ్ల క్రితం జైకా నిధులు రూ. 350 కోట్లనుసాగర్ క్లీనింగ్ పేరుతో హెచ్ఎండీఏ అధికారు-లు ఖ ర్ చు చేశారు. అందులో భాగంగానే.. సాగ ర్లోకి ర సాయ న వ్యర్థాలు క లిసే .. కూక ట్ ప ల్లి ,మియాపూర్, పికేట్ నాలాల ను డైవ ర్ట్ చేశారు.అయిన సాగ ర్ లో కాలుష్యం తగ్గలేదు. కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు.దీంతో ప్రతి రోజు టన్ను ల కొద్ది వ్యర్ధాలు వచ్చిసాగర్ లో నేరుగా కలుస్తున్నాయి. గ తేడాదికెనడాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సోలార్ద్వారా సాగర్ నీటిని శుద్ధి చేస్తామని కొద్ది రోజులుప్రయోగాలు కూడా చేసింది. కానీ దాని ఫలితాలుఇప్పటి వరకు బయటపెట్టలేదు హెచ్ఎండీఏ.తర్వాత బెంగళూర్ బేస్డ్ సంస్థ నాకాఫ్ కు సాగర్క్లీనింగ్ బాధ్యతలు అప్పగించారు. ఏటా రూ. మూ-డున్నర కోట్ల కాంట్రాక్ట్ ఇది. ఈ నెలాఖరులోగాకాంట్రాక్ట్ పూర్తి కానున్నా.. సాగర్ లో ఆశించినమార్పు కానరావడం లేదు.

సాగర్ లో గులికల వైద్యం
సాగర్ శుద్ధి కోసం హెచ్ఎండీఏ గులికల వైద్యాన్నినమ్ముకుంది. ఒప్పందం ప్రకారం సాగర్ నుండి దుర్వాసన రాకుండా చేయడంతో పాటు ఆక్సిజన్ లెవల్స్ పెంచాల్సిన నాకాఫ్ కూడా పైపైనే పనులుచేస్తోంది. ఫలితంగా హుస్సేన్ సాగర్ అధ్వానంగా మారింది. సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ ఏరియాల్లో మరీ ఘోరం. కనీసం సాయంత్రం వేళల్లో సాగర్ వద్ద రిలాక్స్ కోసంనిలబడే పరిస్థితి కూడా లేదంటున్నారు సిటీజనం.