రైల్వే ఉద్యోగాలు  ఇప్పిస్తానంటూ మోసం ..ఏడుగురి నుంచి  రూ. 17 లక్షలు వసూళ్లు

రైల్వే ఉద్యోగాలు  ఇప్పిస్తానంటూ మోసం ..ఏడుగురి నుంచి  రూ. 17 లక్షలు వసూళ్లు

గద్వాల, వెలుగు : రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నిరుద్యోగుల నుంచి రూ. 17 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల పరిధిలోని అల్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామంలో గురువారం వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గద్వాల మండలం పూడూరు గ్రామానికి చెందిన పుల్లన్న తాను రైల్వే ఉద్యోగినంటూ ప్రచారం చేసుకుంటూ, రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించాడు. దీంతో ధరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలోని అల్లపాడు గ్రామానికి చెందిన నరసింహులు రూ. 4.95 లక్షలు, గోవిందమ్మ రూ. 4.10 లక్షలు, జోసెఫ్ రూ. 4.45 లక్షలు, లక్ష్మన్న రూ. 85 వేలు, వెంకటన్న రూ. లక్ష, రంగస్వామి రూ. 1.80 లక్షలతో పాటు మరికొందరు సైతం పుల్లన్నకు డబ్బులు ఇచ్చారు.

ఇలా ఏడుగురి వద్ద రూ. 17 లక్షల వరకు వసూలు చేశాడు. డబ్బులు ఇచ్చి రోజులు గడిచిపోతున్నా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు పుల్లన్నను నిలదీయగా.. ఇప్పుడు, అప్పుడు అంటూ దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో నకిలీ ఐడీ కార్డులు తయారు చేసి ఇచ్చిన నిందితుడు కొన్ని నెలల తర్వాత అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్లు వస్తాయంటూ నమ్మించాడు. నిరుద్యోగులు ఐడీ కార్డులను రైల్వే శాఖలో చూపించగా అవి నకిలీ అని తేలింది. మరో పుల్లన్న సొంత గ్రామంలో ఎంక్వైరీ చేయగా... అతడు అసలు రైల్వే ఉద్యోగే కాదని తెలిసింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు గురువారం ధరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నందికర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
తెలిపారు.