ట్రేడింగ్​లో  ఇన్వెస్ట్​మెంట్ పేరుతో ఫ్రాడ్

ట్రేడింగ్​లో  ఇన్వెస్ట్​మెంట్ పేరుతో ఫ్రాడ్
  •     డైలీ 2 నుంచి 3 శాతం రిటర్న్స్ ఉంటాయని చెప్పి ట్రాప్
  •     మల్టీజెట్ కంపెనీ ఎండీ, మార్కెటింగ్ హెడ్ అరెస్ట్


హైదరాబాద్‌‌,వెలుగు: ట్రేడింగ్​లో  ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని చెప్పి నమ్మించి మోసం చేసిన మల్టీజెట్‌‌ ట్రేడింగ్‌‌ కంపెనీ ఎండీ టేకుల ముక్తిరాజ్‌‌(62ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముషీరాబాద్‌‌కు చెందిన ముక్తిరాజ్‌‌.. రియల్‌‌ లైఫ్‌‌ ఇన్ ఫ్రా డెవలపర్‌‌‌‌ పేరుతో రియల్‌‌ ఎస్టేట్‌‌ బిజినెస్ చేసేవాడు. ఈ ఏడాది ఆగస్టులో రియల్ లైఫ్​ ఇన్​ఫ్రాను మల్టీజెట్‌‌ ట్రేడింగ్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్​గా పేరు మార్చాడు. హబ్సిగూడలో హెడ్డాఫీసు ఓపెన్ చేశాడు. ట్రేడింగ్‌‌లో ఇన్వెస్ట్ చేస్తే  ప్రతి రోజు 2 నుంచి 3 శాతం రిటర్న్స్ ఇస్తామని ప్రచారం చేశాడు.

ఇందుకోసం ప్రత్యేక యాప్ క్రియేట్ చేశాడు. ఇన్వెస్ట్‌‌ చేసిన వారికి లాగిన్ ఐడీ ఇచ్చి ట్రేడింగ్‌‌ చేయించాడు. ఇన్వెస్ట్ చేసిన డబ్బుతో పాటు లాభం కనిపించేలా యాప్​లో చూపించాడు. ఇలా సుమారు 100కు పైగా బాధితుల నుంచి చైన్ సిస్టమ్​తో ఇన్వెస్ట్​మెంట్​ చేయించి పెద్ద మొత్తంలో డబ్బు కలెక్ట్ చేశాడు. ఈ నెల 10 నుంచి హబ్సిగూడలోని ఆఫీసును క్లోజ్ చేశాడు. దీంతో ఇన్వెస్ట్ చేసిన వారు ముక్తిరాజ్​కు కాల్ చేయగా.. రెస్పాన్స్ లేదు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు గత వారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం ముక్తిరాజ్​తో పాటు మార్కెటింగ్ హెడ్ గట్టగల్ల భాస్కర్(36)ను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.