
ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లు, ట్రేడింగ్, షేర్ మార్కెట్, తక్కువ టైమ్‌లో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్న వారు కొందరైతే.. బడాబాబులు,రాజకీయ ప్రముఖుల పేర్లు చెప్పి కోట్లు దండుకుంటున్న వారు మరి కొందరు ఉన్నారు. లేటెస్ట్ గా తెలంగాణలోని సచివాలయంలో ఐటీ మంత్రి పేచీ పేరుతో ఓ ఇంజినీర్ ను నిండా ముంచాడు.
మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ఐటీ ప్రాజెక్ట్ మంజూరు చేస్తామంటూ నమ్మించాడు. మియాపూర్ ఐటీ ఇంజినీర్‌ను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేశాడు. మంత్రి ఓఎస్‌డీ లెటర్‌హెడ్‌లు, నకిలీ పత్రాలు చూపించి నమ్మించి మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఆరుగురిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణను సీసీఎస్‌కు బదిలీ చేశారు.
185 రకాల సైబర్ మోసాలు
ఆన్లైన్ వేదికగా దాదాపు 185 రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. రైతులు, కార్పొరేట్ కంపెనీలు సహా వ్యాపారవేత్తలు సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు. ప్రతి ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో 90 శాతం మంది బాధితులు విద్యా వంతులే ఉంటున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఎక్కువ మంది బాధితులు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కర్నాటకకు చెందిన వాళ్లే ఉంటున్నారు. డార్క్ వెబ్‌సైట్ల నుంచి కొన్న ఫోన్ నంబర్లు, ఏజెన్సీల ద్వారా కలెక్ట్ చేసిన బ్యాంక్ అకౌంట్లతో వరుస మోసాలకు పాల్పడుతున్నారు.