ఏటీఎంలో మనీ డిపాజిట్ పేరుతో మోసం

ఏటీఎంలో మనీ డిపాజిట్ పేరుతో మోసం

హైదరాబాద్:  ఉపాధి కల్పించిన సంస్థకే కన్నం వేశారు. ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో ఆ సంస్థ డబ్బులు డిపాజిట్ చేస్తోంది. ఈ క్రమంలో ఓ ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేయడానికి తమ సిబ్బందిని  పంపింది. కానీ నిందితులు ఆ డబ్బును ఏటీఎంలలో డిపాజిట్ చేయకుండా తమ సొంతానికి వాడుకున్నారు. ఈ విధంగా డిపాజిట్ పేరుతో   కోటి 30 లక్షల రూపాయలను వాడుకుని కంపెనీని మోసం చేశారు. అయితే సిబ్బందిపై సంస్థకు అనుమానం వచ్చి డబ్బుల మాయంపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేశారు. దాని ప్రకారం ఇద్దరిని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 16 లక్షలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.