తస్మాత్ జాగ్రత్త.. రామ మందిరం ట్రస్టు నిధుల సేకరణ పేరుతో దోచుకుంటున్రు

తస్మాత్ జాగ్రత్త.. రామ మందిరం ట్రస్టు నిధుల సేకరణ పేరుతో దోచుకుంటున్రు

అయోధ్యలో రామ మందిరానికి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు, రామజన్మభూమి ట్రస్ట్ పేరుతో నిధులు వసూలు చేస్తోన్న వ్యక్తులను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) బహిర్గతం చేసింది.  ఈ సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపడం, ఆలయానికి విరాళాలు ఇవ్వడం, లావాదేవీలకు క్యూఆర్ కోడ్‌లు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. వారు 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం అయోధ్య, ఉత్తరప్రదేశ్' నకిలీ సోషల్ మీడియా పేజీని సృష్టించారు. అక్కడ విరాళాలు సేకరించడానికి ఓ నకిలీ QR కోడ్ ను కూడా పోస్ట్ చేశారు.

సైబర్ నేరగాళ్లకు సంబంధించి VHP హెచ్చరిక

सावधान..!!
श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र के नाम से फर्जी आईडी बना कर कुछ लोग पैसा ठगी का प्रयास कर रहे हैं। @HMOIndia @CPDelhi @dgpup @Uppolice को ऐसे लोगों के विरूद्ध विलम्ब कार्यवाही करनी चहिए। @ShriRamTeerth has not authorised any body to collect funds for this occasion. pic.twitter.com/YHhgTBXEKi

— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) December 31, 2023

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించే వ్యక్తుల ఉచ్చులో పడవద్దని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ ద్వారా ప్రజలను హెచ్చరించారు. జాగ్రత్త! కొందరు వ్యక్తులు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం నకిలీ IDని తీసుకుని ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని VHP ప్రతినిధి బన్సాల్ X పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ పోలీసులు, ఉత్తరప్రదేశ్ డీజీపీ, యూపీ పోలీసులను ఆయన కోరారు. ఇలా నిధులు సేకరించడానికి ఎవరికీ అధికారం ఇవ్వలేదని అన్నారాయన.

VHP ఫిర్యాదు

వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు , కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశామని బన్సాల్ చెప్పారు. అతను ఉత్తరప్రదేశ్ పోలీసు చీఫ్‌కు పంపిన ఫిర్యాదు కాపీని కూడా పంచుకున్నారు. దాని కాపీని ఆదిత్యనాథ్, హోం మంత్రి షాకు మార్క్ చేశారు. ట్రస్టు విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ డీజీపీ, లక్నో రేంజ్ ఐజీకి అధికారిక ఫిర్యాదును పంపామని బన్సాల్ మరో పోస్ట్‌లో తెలిపారు.