అధిక వడ్డీ పేరుతో ఆశ జూపి నమ్మిన కాలనీ వాసుల నెత్తిన టోపి పెట్టారు మోసకారి దంపతులు. కాలనీలో ఈ పక్కోళ్లను ఆపక్కోళ్లను పరిచయం చేసుకున్నరు. వాళ్లు నమ్మేదాక నటించిన్రు.. చిట్టీలు వేస్తున్నాం.. మీ డబ్బులు ఎక్కడ పోవు.. పైగా అధిక వడ్డీ ఇస్తాం.. మమ్మల్ని నమ్మండి అంటూ నటిస్తూ బుట్టలో వేసుకున్నరు. చివరికి కాలనీ వాళ్ల నెత్తిన టోపీ పెట్టి కోట్ల రూపాయలతో ఉడాయించారు.. హైదరాబాద్ లోని ఉప్పల్ పీఎస్ పరిధిలోని కుమ్మరికుంటలో అధిక వడ్డీల ఆశచూపి రూ.3కోట్లతో ఉడాయించారు మోసకారి దంపతులు స్టోరీ ఒకటి వెలుగులోకి వచ్చింది.
కుమ్మరికుంటలో సురేష్, శాంతి భార్యభర్తలు.. పదేళ్లుగా కుమ్మరికుంటలో ఇల్లు రెంట్ కు తీసుకొని ఉంటున్నారు. చిట్టీలు వేయడం, అధిక వడ్డీ చెల్లిస్తామంటూ కాలనీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం, తిరిగి ఇవ్వడం చేస్తున్నారు. పదేళ్లుగా కాలనీలో అందరితో కలగలుపుగా ఉంటున్నారు. ఈ జంటను నమ్మిన కాలనీ వాసులు కోట్ల రూపాయలు చిట్టీలు, అప్పులుగా వారికి ఇచ్చారు.10 శాతం వడ్డీ ఇస్తామని చెప్పాడంతో 3 కోట్ల రూపాయలు మోసకారి దంపతులకు అప్పజెప్పారు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో కాలనీ వాసులకు ఆ మోసకారి దంపతులు షాక్ ఇచ్చారు.
►ALSO READ | ఇండిగో ఫ్లైట్ల పరేషాన్.. దేశవ్యాప్తంగా 12వందల ఫ్లైట్స్ రద్దు..కారణమేంటంటే..
కుమ్మరికంటలో సురేష్, శాంతి అద్దెకు ఉంటున్న ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆందోళనకు గురయ్యారు స్థానికులు. మోసపోయామని తెలుసుకొని అక్టోబర్ 22 న ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కోట్ల రూపాయలతో పరారీ అయిన సురేష్, శాంతి దంపతులు చిక్కకపోవడంతో పోలీసులు పరేషాన్ అవుతున్నారు.
