డీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి సందర్భంగా ఆయనకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం పేద పిల్లలకు ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందన్న స్టాలిన్... మొదటి దశలో 1.16 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించనున్నామని తెలిపారు.
ఈ పథకాన్ని మరింత విస్తరిస్తామని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఇది ఉచితమని ఎవరూ అనుకోవద్దన్న ఆయన... ఇలా చేయడం ప్రభుత్వ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నా ఈ పథకాన్ని మాత్రం ఆపకూడదని అధికారులను ఆదేశించారు. మీ పిల్లలకు భోజనం పెట్టే విధంగానే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వ అధికారులందరికీ సీఎం విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
