మహాలక్ష్మి స్కీం.. 4 నెలల్లో మహిళలకు రూ. 11 వందల 77 కోట్లు మిగిలినయ్

మహాలక్ష్మి స్కీం.. 4 నెలల్లో మహిళలకు రూ. 11 వందల 77 కోట్లు మిగిలినయ్

 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకానికి ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తుంది. మహాలక్ష్మి స్కీం ప్రారంభించిన నాలుగు నెలల్లోనే రాష్ట్ర మహిళలకు ఏకంగా రూ.1.177 కోట్ల రూపాయలు మిగిలాయని అధికారిక వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 9, 2023న ప్రారంభించబడిన ఈ పథకం TSRTC బస్సుల వినియోగంలో పెరుగుదలను చూసింది. 

తెలంగాణలో స్థరపడ్డ బాలికలు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తులు TSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.  ప్రారంభంలో, రోజుకు సుమారు 14 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందారు, ఇది క్రమంగా పెరుగుతూ ఇప్పుడు సగటున 29.67 లక్షల మంది మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నారు. 

  • డిసెంబర్ లో 26.99 లక్షలు
  •  జనవరిలో  28.10 లక్షలు
  • ఫిబ్రవరిలో 30.56 లక్షలు
  • మార్చిలో 31.42 లక్షల మంది ప్రాయాణించినట్టు అధికారులు తెలిపారు.  

ప్రతిరోజూ సుమారు ఆరు లక్షల మంది మహిళలు కాంప్లిమెంటరీ బస్సు ప్రయాణ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. గతంలో బస్ పాస్, ఛార్జీల కోసం మహిళలు రూ.1500 వరకు వెచ్చించాల్సి వచ్చేది. ఆ మొత్తం డబ్బులు ఇప్పుడు ఆదా అవుతుండటంతో అటు ప్రభుత్వం తరపునుంచి ఆర్టీసీకి ఇటు మహిళలకు లాభం చేకూరుతున్నట్టు తెలుస్తుంది.