చెన్నై: తమిళనాడులో మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత విస్తరించనున్నారు. అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక 'వెట్రి పయనం' పథకం ఏర్పాట్లపై సోమవారం అధికారులతో సీఎం జోసెఫ్ విజయ్ సమీక్ష నిర్వహించారు. ఈ పథకం ద్వారా ప్రతిరోజూ దాదాపు 84.32 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రవ్యాప్తంగా 12,692 ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇప్పటివరకు నగర, పట్టణ బస్సులకే పరిమితమైన ఈ రాయితీని.. ఇకపై ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులతో పాటు 40 కి.మీ. దాటి
తిరిగే మోఫుస్సిల్, ఘాట్ బస్సులకు కూడా వర్తింపజేస్తున్నారు. ఈ బస్సులు రోజూ 1.65 లక్షలకు పైగా ట్రిప్పులు తిరుగుతాయి.
