గర్భవతులకు ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ

గర్భవతులకు ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ

హైదరాబాద్, వెలుగు: గర్భిణులకు రవాణా సౌకర్యాలు కల్పించేందుకు క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్ ముందుకు వచ్చింది. హెల్త్ చెకప్​లు, అత్యవసరంగా హాస్పిటల్స్ కు తరలించేందుకు అవసరమైన క్యాబ్ సర్వీసులను ఉచితంగా అందిస్తోంది. గిగ్ అండ్ ఫ్లాట్ పాం వర్కర్స్ యూనియన్, యాప్ బేస్డ్ ట్రాన్స్ పోర్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ సేవలను ప్రారంభించింది. లాక్ డౌన్ కారణంగా గర్భిణులు హాస్పిటళ్లకు వెళ్లేందుకు  ట్రాన్స్ పోర్టు లేక ఇబ్బందులు పడుతున్నారు.  వారి కోసం ఈ ఫ్రీ క్యాబ్ సర్వీసును మొదలుపెట్టినట్లుగా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సల్లావుద్దీన్ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం సిటీలో 5 క్యాబ్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎక్కడి నుంచైనా ఈ సేవలు  పొందవచ్చన్నారు. అవసరమైన వాళ్లు +91-9177624678 నంబర్ కు సంప్రదించి క్యాబ్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు.

మేడ్చల్​లో హెల్ప్ లైన్ సెంటర్
గర్భిణులకు ఉచిత పరీక్షలు, డెలివరీ సేవల కోసం మేడ్చల్ జిల్లా పరిధిలో హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించినట్లుగా జిల్లా మెడికల్ ఆఫీసర్ మల్లిఖార్జున్ రావు వివరించారు. ప్రెగ్నెన్సీ టెస్టులు, కరోనా బారిన పడిన గర్భిణులకు వైద్య సేవలు అందించేలా ఈ హెల్ప్ లైన్ సెంటర్ పనిచేస్తుందన్నారు.  ఎమర్జెన్సీ అంబులెన్స్, డెలివరీ ఫెసిలిటీ, ఇతర అనారోగ్య సమస్యలకు సలహాలు, సూచనలను పొందవచ్చన్నారు.   ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వైద్యాధికారులు కూడా ఈ సేవలు పొందవచ్చన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ సేవల కోసం 7382471061, 7382482399 హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయాలన్నారు.