తక్షశిల అకాడమీలో ఫ్రీ సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌

తక్షశిల అకాడమీలో ఫ్రీ సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో  ప్రతిభ, అర్హత గల విద్యార్థులకు ఫ్రీ సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ అందించనున్నట్లు తక్షశిల ఐఏఎస్‌ అకాడమీ వెల్లడించింది. ఆసక్తి ఉన్న స్టూడెంట్లు వచ్చే నెల 5 లోగా www.takshasilaias.com   వెబ్ సైట్ ద్వారా  అప్లై చేసుకోవాలని అకాడమీ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఎస్‌ఎన్‌ దుర్గాప్రసాద్‌ కోరారు. ఏప్రిల్ 9న ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రవేశ పరీక్షలో మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ 3 ఏండ్లు, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ 5 ఏండ్లు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు తెలిపారు. పరీక్షలో 80 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తామని వివరించారు. 10వ తరగతి చదివిన వారు ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు, ఇంటర్మీడియట్ చదివిన వారు మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్సుకు అర్హులని దుర్గాప్రసాద్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం అకాడమీ వెబ్‌సైట్ లేదా నేరుగా అకాడమీని సంప్రదించవచ్చని సూచించారు.