బస్సు ఎక్కి స్టాప్ వచ్చినా దిగలేదు.. కండక్టర్ దగ్గరికి వెళ్లి చూసి షాక్.. కరీంనగర్ ఆర్టీసీ బస్సులో విషాద ఘటన

బస్సు ఎక్కి స్టాప్ వచ్చినా దిగలేదు.. కండక్టర్ దగ్గరికి వెళ్లి చూసి షాక్.. కరీంనగర్ ఆర్టీసీ బస్సులో విషాద ఘటన

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రయాణికుడు సీట్లో ప్రాణాలు ఒదిలాడు. దిగాల్సిన స్టాప్ వచ్చినా  దిగకపోవడంతో కండక్టర్ అతని సీటు దగ్గరికి వెళ్లి గమనించగా అప్పటికే మృతిచెందాడు. కరీంనగర్  జిల్లాలో ఎన్టీపీసీ  దగ్గర మే (13) బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. 

కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వెళ్తున్న కరీంనగర్ 2 డిపోకు చెందిన బస్సులు ఈఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర సిరివంచకు చెందిన అబ్దుల్ రజాక్ అనే ప్రయాణికులు కరీంనగర్ లో బస్సు ఎక్కి ఎన్టీపీసీకి టికెట్ తీసుకున్నాడు. అయితే ఎన్టీపీసీ స్టాప్ వచ్చినప్పటికీ అబ్దుల్ దిగకపోవడంతో గమనించిన కండక్టర్ అతని సీటు దగ్గరకు వెళ్లి  చూడగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే 108కు సమాచారం అందించగా బస్ స్టేషన్ కు చేరుకున్న వైద్య సిబ్బంది అప్పటికే అబ్దుల్ చనిపోయినట్లు గుర్తించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అబ్దుల్ మార్గమధ్యలో సన్ స్ట్రోక్ తోగానీ, గుండెపోటుతో గానీ చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్  మార్టమ్ కు తరలించారు. మృతుడి జేబులో ఉన్న అధార్ కార్డును బట్టి మహరాష్ట్ర సిరివంచకు చెందిన అబ్దుల్ రజాక్ గా గుర్తించారు పోలీసులు.