
హైదరాబాద్ లో ఓ ఇండియన్ ఇంజరింగ్ సర్వీస్ ఆఫీసర్.. ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ కు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. జీఎస్ఐలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కె రామర్.. హరిణ వనస్థలి నేషనల్ పార్క్ కు జాగింగ్ కోసం వస్తుంటారు. ఆయనకు సైక్లింగ్, రన్నింగ్ లో నైపుణ్యం ఉంది. అయితే నేషనల్ పార్క్ లో SI , కానిస్టేబుల్ అభ్యర్థులు కొందరు.. రాచకొండ కమిషనరేట్ లో హోంగార్డుగా పనిచేస్తున్న లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈవెంట్స్ కు ప్రాక్టీస్ చేస్తున్నారు. రామర్ గురించి తెలసుకున్న లక్ష్మణ్.. SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వాలని రామర్ ను కోరారు.
దీనికి ఓకే చెప్పిన రామర్.. 70 మందికి కోచింగ్ ఇస్తున్నారు. రామర్ తో పాటు రాచకొండ CP ఆఫీస్ లోపని చేస్తున్నSI ప్రమోద్,కొంత మంది కానిస్టేబుల్స్ కూడా అభ్యర్థులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. లక్ష్మణ్ హోమ్ గార్డ్ అయినప్పటికీ, ఇప్పటి వరకు తన కాలనీలోని 9 మందిని పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరేలా ప్రోత్సహించారు. 9 మందిలో ఇద్దరు SI లు ఉన్నారు. ఈ బ్యాచ్ లో కూడా చాలా మంది పోలీస్ జాబ్ సాధిస్తారని లక్ష్మణ్ చెప్పారు. మరోవైపు SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వడం సంతోషంగా ఉందని కె రామర్ తెలిపారు.