రేపటి నుంచి 15 వరకు ఆఫర్

రేపటి నుంచి 15 వరకు ఆఫర్

హైదరాబాద్, వెలుగు: ఆజాదీ కా అమృత్‌‌ మహోత్సవంలో భాగంగా పర్యాటకులకు కేంద్రం శుభవార్త అందించింది.దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలు, స్మారక కట్టడాలను ఉచితంగా సందర్శించేం దుకు అవకాశం కల్పిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. 

ఈ నెల 5 నుంచి 15 వరకు ఫ్రీ ఎంట్రీకి చాన్స్ ఉంటుందని వెల్లడించింది. ఈ జాబితాలో మన రాష్ట్రం నుంచి చార్మినార్, గోల్కొండ కోట, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, పిల్లల మర్రి, రామప్ప టెంపుల్ ఉన్నాయి.