
న్యూఢిల్లీ: భారత్, ఒమన్ మధ్య ప్రతిపాదిత ఫ్రీ ట్రేడ్అగ్రిమెంట్(ఎఫ్టీఏ)పై త్వరలోనే సంతకాలు జరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు. ప్రస్తుతం వాణిజ్య ఒప్పందం వివరాలను అరబిక్‌లోకి అనువదిస్తున్నారు. ఆ తర్వాత, రెండు దేశాల మంత్రివర్గాలు ఒప్పందాన్ని ఆమోదిస్తాయని చెప్పారు.
సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) అని పిలిచే ఈ ఒప్పందం కోసం చర్చలు నవంబర్ 2023లో అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇది అమల్లోకి వస్తే చాలా వస్తువులపై కస్టమ్స్ టారిఫ్లు చాలా వరకు తగ్గుతాయి లేదా రద్దవుతాయి.