అమర రాజా ఉద్యోగులతోపాటు ఫ్యామిలీకి ఫ్రీగా వ్యాక్సిన్

అమర రాజా ఉద్యోగులతోపాటు ఫ్యామిలీకి ఫ్రీగా వ్యాక్సిన్

తిరుపతి: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అంచనా వేయలేనంత ప్రమాదకరంగా మారిందన్నారు అమర రాజా సంస్థ వైస్ చైర్మైన్ జయదేవ్ గల్లా. ఈ కష్టకాలంలో తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఫ్రీగా కోవిడ్ టీకాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్య సంరక్షణ సంస్థలు, ఏజెన్సీలు, పివిసిలతో భాగస్వామ్యం చేసుకుని 18 సంవత్సరాల వయస్సు పైబడిన ప్రతి ఉద్యోగికి తప్పకుండా ఉచితంగా కోవిడ్ టీకాలు వేయించే కార్యక్రమాన్ని మే 5న ప్రారంభించామని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సుకు సంస్థ ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న ప్రజలందరికీ కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిన వెంటనే అమర రాజా సంస్థ ఈ ప్రక్రియను ప్రారంభిస్తుందని తెలిపారు.

ఈ ఆరోగ్య సంక్షోభం నుండి బయటపడటానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న  కృషిని ప్రశంసించారు గల్లా. ఈ క్రమంలోనే సంస్థగా మా వంతు చేయగలిగినంత కృషి చేయాలనుకుంటున్నామన్నారు. ఈ పరిస్థితులల,  ప్రతి ఒక్కరూ త్వరగా టీకాలు వేయించుకోవడం ఎంతో అవసరమని దృఢంగా నమ్ముతున్నామన్నారు. భవిష్యత్తులో, అవసరం వచ్చినప్పుడు, ఇలాంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని మా వంతు బాధ్యతను నిర్వహిస్తామని తెలిపారు. మహమ్మారికి ముందు, గతంలో కూడా, అమర రాజా సంస్థ వారి ఉద్యోగులు.. ఇతర వాటాదారుల ప్రయోజనం కోసం ఇటువంటి అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలియచేశారు జయదేవ్ గల్లా.