అందరికీ ఉచితంగా వ్యాక్సిన్

అందరికీ ఉచితంగా వ్యాక్సిన్
  • ఈనెల 21 నుంచి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్: ప్రధాని మోడీ
  • వ్యాక్యిన్ కేంద్రమే కొని రాష్ట్రాలకు ఇస్తుంది
  • రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు
  • వ్యాక్సినేషన్ బాద్యత పూర్తిగా కేంద్రానిదే
  • 25 శాతం కోటా ప్రైవేటు హాస్పిటల్స్  కొనుక్కోవచ్చు
  • ప్రైవేటు ఆస్పత్రులు 150 మాత్రమే సర్వీస్ చార్జి తీసుకోవాలి

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ఒక్కరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుందని, 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. కరోనా దేశ పరిస్థితులపై జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన పేద వర్గాలతోపాటు సామాన్యులను ఆదుకోవడానికి పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 18 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్న వారందరికి ఉచితంగా వాక్సిన్‌  ఇవ్వడం జరుగుతుందని, ఏ ఒక్కరూ వ్యాక్సిన్ కొనాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, కేంద్రమే కొని రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ బాధ్యత ఇక నుంచి పూర్తిగా కేంద్రానిదేనని ఆయన వెల్లడించారు. వ్యాక్యిన్ కేంద్రమే కొని రాష్ట్రాలకు ఇస్తుంది. రాష్ట్రాల వ్యాక్సినేషన్ బాధ్యతను కూడా కేంద్రమే తీసుకుంటుందని ప్రధాని మోడీ వివరించారు. ప్రైవేటు ఆస్పత్రులు 150 మాత్రమే సర్వీస్ చార్జి తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, 25 శాతం ప్రైవేటు హాస్పిటల్స్ లో కొనుక్కోవచ్చని సూచించారు. 
ఉచిత వ్యాక్సిన్ ను ఏ రాష్ట్రానికి, ఎప్పుడు, ఎన్ని వాక్సిన్లు ఇస్తామన్నది ముందుగానే తెలియజేస్తామని ప్రధాని మోడీ వివరించారు. 45 ఏళ్లకు పైబడిన వారిలో రాష్ట్రాలలో మిగిలిపోయిన దాదాపు 25 శాతం మందికి కేంద్ర ప్రభుత్వం రెండు వారాల పాటు ఉచితంగా వాక్సిన్‌ అందజేస్తుందని, వాక్సిన్లపై ఇక నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఆ ఖర్చును కేంద్రమే పూర్తిగా భరిస్తుంది. ఇందుకోసం దేశంలో మొత్తం వాక్సిన్‌ ఉత్పత్తిలో 75 శాతం కేంద్రమే స్వయంగా కొనుగోలు చేసి, రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తుంది. ఎవరైనా ప్రైవేటు ఆస్పత్రుల్లో వాక్సిన్‌ వేసుకోవాలంటే వారి కోసం ఉత్పత్తిలో 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులకు ఉత్పత్తి సంస్థలు ఇస్తాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వాక్సిన్‌కు కేవలం రూ.150 మాత్రమే వసూలు చేయాలి.. ’’ అని ప్రధాని మోడీ చెప్పారు.