ఫ్రెంచ్ ఫ్రైస్ రూ.15,000

ఫ్రెంచ్ ఫ్రైస్ రూ.15,000

పిజ్జా, బర్గర్​, సమోస, పావ్ బాజీ... ఇలా చెప్పుకుంటూ పోతే జంక్​ ఫుడ్స్ లిస్ట్​ పెద్దదే. అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంతో ఇష్టంగా ​తినేది మాత్రం ఫ్రెంచ్​ ఫ్రైస్. ఎంత తిన్నా లెక్కే ఉండదు. కానీ, ఒక దగ్గర మాత్రం ఈ ఫ్రెంచ్​ ఫ్రైస్ తినాలంటే మాత్రం డేర్​ చేయాల్సిందేనట. ఎందుకంటారా?

న్యూయార్క్​లోని సెరెండిపిటీ రెస్టారెంట్​లో ఫ్రెంచ్​ ఫ్రైస్​ తినాలంటే కాస్త ఎక్కువే ఖర్చవుతుంది. ఎందుకంటే అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్​ ఎంతో తెలుసా... అక్షరాలా రెండు వందల డాలర్లు. అంటే మన కరెన్సీలో పదిహేను వేల రూపాయలు. మామూలుగా అయితే ఏ రెస్టారెంట్​లో అయినా ఇంత రేటు ఉండదు. మరి ఇక్కడెందుకు ఈ రేటు? వీటినేమైనా బంగారంతో తయారు చేస్తారా? అంటే... అవును. వీటి తయారీలో బంగారాన్ని వాడతారు. అందుకే ఇవి మామూలు ఫ్రెంచ్ ఫ్రైస్​ కాదు. వీటి తయారీ చివర్లో బంగారు రేకుల్ని చల్లుతారు. అందుకని వీటి రేటు ఇలా పెంచారన్నమాట. ఇదేదో వైరల్ వీడియో కోసం చేశారనుకుంటే పొరపాటు. ఫ్రెంచ్ ఫ్రైస్​ బంగారు రేకుల్ని వాడినందుకు గానూ ఇది ప్రపంచంలోనే ‘మోస్ట్ ఎక్స్​పెన్సివ్ ఫ్రెంచ్​ ఫ్రైస్​’గా గిన్నిస్​ వరల్డ్ బుక్​లో చోటు దక్కింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ, గిన్నిస్ రికార్డు అందుకున్న వీడియోని గిన్నిస్​ రికార్డ్ అఫీషియల్ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​లో పోస్ట్ చేశారు.