రాజ్‌‌‌‌‌‌‌‌భవన్ ఆహ్వాన పత్రికలో తమిళనాడు బదులు ‘తమిళగం’!

రాజ్‌‌‌‌‌‌‌‌భవన్ ఆహ్వాన పత్రికలో తమిళనాడు బదులు ‘తమిళగం’!

ప్రభుత్వ చిహ్నాన్నీ మిస్ చేసిన వైనం

చెన్నై: తమిళనాడు సర్కారు, రాష్ట్ర గవర్నర్ మధ్య వివాదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అటు ప్రభుత్వం కానీ, ఇటు గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానీ ఎక్కడా తగ్గడం లేదు. ప్రసంగం వివాదంతో అసెంబ్లీ నుంచి గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాకౌట్ చేసిన ఘటన మరువకముందే.. ‘పొంగల్’ దంగల్‌‌‌‌‌‌‌‌కు తెరలేచింది. డీఎంకే సర్కారును పొంగల్ పండుగ సందర్భంగా ఆహ్వానించిన గవర్నర్ ఆర్ఎన్ రవి.. అందులో తమిళనాడుకు బదులుగా ‘తమిళగం’ అని పేర్కొన్నారు. ఇది కొత్త వివాదానికి కారణమైంది. తమిళంలో ఇన్విటేషన్ పంపిన రాజ్‌‌‌‌‌‌‌‌భవన్.. అందులో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని మిస్ చేసింది.

డీఎంకే, దాని మిత్రపక్షాల ఫైర్

‘తమిళగం’ అంటూ ఇన్విటేషన్‌‌‌‌‌‌‌‌ పంపడంపై డీఎంకే, దాని మిత్రపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తమపై రుద్దేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఆయన ప్రకటనలు తప్పని డీఎంకే నేత టీఆర్ బాలు అన్నారు. రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన రెండు ఇన్విటేషన్లను ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షేర్ చేసిన సీపీఎం ఎంపీ వెంకటేశన్.. ‘‘కిందటేడాది వచ్చిన ఆహ్వానంలో ‘తమిళనాడు గవర్నర్’ అని ఉంది. ఇప్పుడు పంపిన ఆహ్వానంలో ‘తమిళగ గవర్నర్’ అని ఉంది. ఆయన నిన్న (సోమవారం) సభ నుంచి వెళ్లిపోయిన స్పీడ్‌‌‌‌‌‌‌‌లోనే.. రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలి. ఆయన్ను బహిష్కరించాలి’’ అని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు.