ముషీరాబాద్, వెలుగు: స్టూడెంట్స్ చదువుతో పాటు ఆటపాటల్లోనూ ముందుండాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచనలకు పదును పెడుతాయని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అటానమస్ కాలేజీ కరస్పాండెంట్ డాక్టర్ సరోజ వివేక్ అన్నారు. మంగళవారం కాలేజీలో డిగ్రీ విద్యార్థుల ప్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అంబేద్కర్ కాలేజీలో సకల సౌకర్యాలతో ఉన్నతమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. ప్రతీ విద్యార్థి సీనియర్స్ నుంచి ఆలోచనలు, టెక్నిక్స్ తెలుసుకోవాలని సూచించారు. లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడాలన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ మట్ట, వైస్ ప్రిన్సిపాల్ కుమారస్వామి, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
