వానాకాలంలో దంచుతున్న ఎండలు.. 38 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు

వానాకాలంలో దంచుతున్న ఎండలు.. 38 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో వానా కాలంలో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలను మించి 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా టెంపరేచర్లు నమోదవు తున్నాయి. దీంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం అత్యధికంగా సూర్యాపేట జిల్లా మేళ్లచెరు వులో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ టైమ్​లో అక్కడ ఉండాల్సిన రెగ్యు లర్ టెంపరేచర్ కంటే 5.8 డిగ్రీలు ఎక్కువ. 

ఇక ఖమ్మంలోని ముదిగొండలో 38.8, నల్గొండలోని తిరుమలగిరిలో 38.7, వన పర్తి జిల్లా కానాయిపల్లిలో 38.7, పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలో 38.3, కొత్తగూడెంలోని బూర్గంపాడులో 38.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 36 నుంచి 38 డిగ్రీల మధ్య గరిష్ట టెంపరేచర్లు రికార్డయ్యాయి.