
కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘మేజర్’ డైరెక్టర్ శశికిరణ్ తిక్క ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తూ, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. బాబీ తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ పాటలో కాజల్, నవీన్ చంద్ర జంట ఆకట్టుకుంటోంది. రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా.. శ్రేయా ఘోషల్ పాడారు.
సత్యభామ (కాజల్), అమరేందర్ (నవీన్ చంద్ర) యూనివర్సిటీలో కలిసి చదువుకున్నప్పటి నుంచీ తమ లవ్ జర్నీని ఈ పాటలో గుర్తు చేసుకుంటారు. ‘కళ్లారా చూసాలే.. నువ్వేనా నువ్వే నేనా, గుండెల్లో దాచాలే నిన్నేనా నా నిన్నేనా నీ ఊహల గుస గుస పదనిసలై ఉయ్యాలే ఊపేనా నీ ఊసుల మధురిమ హృదయమునే మైకంలో ముంచేసేనా’..అంటూ సాగిన మెలోడీ సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఉంది. ఇందులో కాజల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కనిపించనుంది. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మే 17న సినిమా విడుదల కానుంది.