కింగ్ చార్లెస్ పట్టాభిషేకం.. వైరల్ అవుతోన్న కప్ప

కింగ్ చార్లెస్ పట్టాభిషేకం.. వైరల్ అవుతోన్న కప్ప

బ్రిటన్ కొత్త చక్రవర్తి చార్లెస్ III పట్టాభిషేకం మే 6న జరగనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం లండన్‌లోని చారిత్రాత్మక రాజ కేథడ్రల్ వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో జరగనుండగా.. ఈ వేడుకకు వివిధ దేశాల అధినేతలు, మత పెద్దలు, ప్రముఖులు హాజరు కానున్నారు. గత కొన్ని నెలలుగా ఈ పట్టాభిషేకానికి సన్నాహాలు సాగుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తలు కూడా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ పట్టాభిషేక కార్యక్రమానికి సంబంధించి మరో వార్త తెగ హల్ చల్ చేస్తోంది. బ్రిటిష్ రాజకుటుంబంతో, చార్లెస్ చక్రవర్తితో ఓ కప్ప ప్రత్యేక సంబంధం కలిగి ఉందన్న వార్త రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది.

బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం,  హయోసెర్టస్ ప్రిన్స్‌చార్లేసి అనే పేరు గల ఈ అరుదైన చెట్టు కప్పను ప్రిన్స్ చార్లెస్ మాగ్నిఫిసెంట్ ట్రీ ఫ్రాగ్ అని కూడా పిలుస్తారు. ఈ కప్పను 2008లో ఈక్వెడార్‌లో కనుగొన్నారు. వాస్తవానికి ఇది రెయిన్‌ఫారెస్ట్ ఆవాసాలను రక్షించడానికి పని చేస్తుంది, కాబట్టి దీనికి ప్రిన్స్ చార్లెస్ పేరు పెట్టారు. ప్రిన్స్ చార్లెస్ పర్యావరణాన్ని రక్షించడానికి పాటుపడడం, ఆ తరహా ప్రచారాలు చేసే వారికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తారు. కాబట్టి అతని గౌరవార్థమే ఈ కప్పకు ఆ పేరు పెట్టారు.

ఇతర కప్పల కంటే పూర్తిగా భిన్నంగా..

అత్యంత అరుదుగా కనిపించే ఈ కప్ప.. గోధుమ రంగులో..  ఇతర కప్పల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దాని శరీరమంతటా నారింజ రంగులో పెద్ద మచ్చలు ఉన్నాయి. దీనిని ఈక్వెడార్ కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ లూయిస్ ఎ. కొలోమా కనుగొన్నారు. అతను కప్ప జాతులను సంరక్షించే మ్యూజియాల కోసం కప్పను అన్వేషిస్తున్నప్పుడు దీన్ని గుర్తించారు.

ఆపరేషన్ గోల్డెన్ ఆర్బ్ పేరుతో పట్టాభిషేకం..

కింగ్ చార్లెస్ పట్టాభిషేకాన్ని ఆర్చి బిషప్ ఆఫ్ కాంటెర్‌‌బరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో చక్రవర్తి చార్లెస్, అతని భార్య క్వీన్ కెమిల్లా పట్టాభిషేకం చేయనున్నారు. ఈ వేడుకకు ఇంటెలిజెన్స్ వర్గాలు పెట్టిన పేరు ఆపరేషన్ గోల్డెన్ ఆర్బ్‌. ఈ పట్టాభిషేకంతో, కింగ్‌‌ చార్లెస్‌‌- 3అధికారికంగా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు అధిపతి కానున్నారు. దాంతో పాటు ఆ పదవికున్న అన్ని హక్కులను పొందనున్నారు.

https://twitter.com/PoplarNurseries/status/1654060068017455105