ఇంటి వైద్యం ఇలాచీ: టెన్షన్, హైబీపీ, షుగర్ అన్నింటికీ రామబాణం..

ఇంటి వైద్యం ఇలాచీ: టెన్షన్, హైబీపీ, షుగర్ అన్నింటికీ రామబాణం..

సాధారణంగా ఇంట్లో ఏ స్వీట్స్ తయారు చేస్తున్నా.. అందులో తప్పనిసరిగా ఇలాచీ పొడిని వేస్తుంటాం. అలాగే చికెన్, మటన్, బగారా రైస్లో వేసే మసాలాల్లో కూడా యాలుకలు వినియోగిస్తాం. వంటల్లో దీన్ని ఉపయోగించడం వల్ల రుచితో పాటు వాసన కూడా అద్భుతంగా వస్తుంది. ఈ ఇలాచీలను వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.

భోజనం చేసిన తర్వాత ఇలాచీ పలుకులను తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.

తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు ఇలాచీలను పొడిచేసి, అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే అసిడిటీ రాకుండా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఇలాచీ కాపాడుతుంది.

ఇందులో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఊపిరితిత్తుల్లో రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. ఆస్తమా వ్యాధితో బాధపడే వాళ్లు ఇలాచీ పొడిని పాలలో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.

హైబీపీతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ అన్నంలో ఇలాచీ పొడి కలిపి తింటే సమస్య అదుపులో ఉంటుంది. మధుమేహ వ్యాధిని కూడా అదుపులో ఉంచుతుంది.

ALSO READ : వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదా? 

 కమ్మని సువాసన, రుచిని అందించే ఇలాచీ గింజలను పొడిచేసి.. ఆ పొడితో పళ్ళు తోముకుంటే చిగుళ్ల సమస్యలు పోతాయి. దంతాలు దృఢంగా మారతాయి.

క్యాన్సర్ వ్యాధికి చెక్ పెట్టాలంటే రోజూ ఆహారంలో ఇలాచీలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో వ్యర్థ పదార్ధాలను బయటకు పంపుతుంది.

ఇలాచీలను నీళ్లలో మరిగించి అందులో కొద్దిగా చక్కెర. కీరదోస రసం వేసి కాసేపు మళ్లీ మరిగిం చాలి. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఒత్తిడి. అలసట తగ్గుతుంది.