జడ్చర్ల నుంచి జపాన్ వరకు..

జడ్చర్ల నుంచి జపాన్ వరకు..
ఇండియా గవర్నమెంట్ ఎన్ఆర్‌ఐలకు ఇచ్చే ప్రెస్టీజియస్ అవార్డ్ .. ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ ’ వారం రోజుల కింద ప్రకటించింది. ఈ అవార్డుని గెలుచుకున్నవాళ్లలో ఒకరైన మురళీధర్ తెలంగాణ బిడ్డ. పాలమూరు జిల్లా లో పుట్టి ప్రపంచ దేశాలకు విద్యుత్ వెలుగులు అందించే వెన్నో కనిపెట్టిండు. అప్పట్లో పదో తరగతి పాస్​ అయితే గొప్పగా చూసేవాళ్లు. పది పాస్​ అయితేచాలనే ఆలోచనే నాలో ఉండేది. ప్రైమరీ స్కూల్​ ఎడ్యుకేషన్​ మా ఊరు కరివెన (భూత్పూరు మండలం, మహబూబ్​నగర్​ జిల్లా)లోనే సాగింది.  బడికి పోతూనే వ్యవసాయ పనులు కూడా చూసుకునేది. సెలవులు వస్తే అమ్మతో కలిసి కలుపు తీయడానికి పోయేది. మాకు పాతిక ఎకరాల భూమి ఉంది. కానీ, పెద్దగా ఆదాయం ఉండేది కాదు. నాకు అన్న, తమ్ముడు, అక్క, ముగ్గురు చెల్లెండ్లు ఉన్నారు. ఏడుగురి చదువులు కష్టంగా ఉండేది. అయినా మా నాన్న చదువులకు ఇబ్బంది రానీయలే. నేను చదివిన ప్రైమరీ స్కూల్​లో క్లాస్​ రూమ్​లు కూడా లేవు. చెట్టు కింద నీడలో పాఠాలు చెప్పేది. స్కూల్​ అయిపోయాక ఊరంతా తిరిగి ఆడినా సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి రావాల్సిందే. దీపాలు ముందు కూర్చుని చదవాల్సిందే. మాతోపాటు మా వీధిలో ఉండేవాళ్ల పిల్లలు కూడా మా ఇంటికి వచ్చి చదువుకునేవాళ్లు. పంతులుగారిల్లు ఊళ్లో హైస్కూల్ లేదు. ఏడో తరగతి అయిపోయాక జడ్చర్ల పోయాను. చిన్న వయసులోనే ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. చదువుకోవాలంటే ఆ కష్టాలు పడాల్సిందే. నలుగురం కలిసి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాం. ఇంటి నుంచి బియ్యం, సరుకులు తీసుకుపోయి, మా అంతట మేమే వండుకుని తినేది. అట్ల తొమ్మిదో తరగతి వరకు అయిపోయింది. టెన్త్​ క్లాస్​ మహబూబ్​ నగర్​లో చదివాను. తర్వాత మళ్లీ జడ్చర్ల వచ్చాను. డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్​ కాలేజ్​లో చేరాను. పదో తరగతి వరకు బాగా చదవలేదు. టెన్త్​ సెకండ్​ క్లాస్​లో పాసయ్యాను. ఉద్యోగం వదులుకుని హోమ్​ ట్యూషన్స్​ బాగా చదువుకుంటే మంచి భవిష్యత్​ ఉంటుందని నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. చదవమని బాగా ప్రోత్సహించేవాడు. ఆ ఇన్​స్పిరేషన్​ వల్ల ఇంటర్​లో స్టడీ మీద ఇంట్రస్ట్​ వచ్చింది. టీచర్​ కావాలన్నది నా కోరిక. ఆ రోజుల్లో వంద మందిలో అయిదారుగురే పాసయ్యేది. ఆ అయిదారుగురిలో  నేనొకడిని. అలా డిగ్రీ అయిపోయింది. ఉస్మానియాలో ఎంఎస్సీ ఫిజిక్స్​ (సాలిడ్​ స్టేట్​ ఫిజిక్స్​ మెటీరియల్​ సైన్స్​)లో సీటొచ్చింది. ఆ తర్వాత బీఈడీ చేశాను. వెంటనే డియస్సీ రాస్తే టీచర్​ జాబ్​ వచ్చింది. కానీ అప్పుడే  పీహెచ్​డీలో సీటొచ్చింది. టీచర్​ జాబ్​ వద్దనుకున్నాను. ఇంట్లో వాళ్లకు నా నిర్ణయం ఇష్టం లేదు. అప్పుటికే మా ఇంట్లో ఆర్థికంగా కష్టంగా ఉంది. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న తార్నాక, రామ్​నగర్​లో హోమ్​ ట్యూషన్స్​ చెప్పాను. నాలుగైదు ఇళ్లలో చెప్పేవాడిని. జేఆర్​ఎఫ్​ నెలకు 1800 రూపాయలు వచ్చినా మా ఇంటి పరిస్థితుల వల్ల ట్యూషన్స్​ చెప్పక తప్పలేదు. నాన్న మాట వినలే 1988లో పీహెచ్​డీ చేస్తున్నప్పుడే రెసిడెన్షియల్​ టీచర్స్​ జాబ్​ రిజల్ట్​ కూడా వచ్చింది. అందులోనూ సెలెక్ట్​ అయ్యాను. అది కూడా వద్దనుకున్నాను. కానీ నా నిర్ణయం మా నాన్నకు ఇష్టం లేదు. ఎలాగైనా ఆ జాబ్​లో చేరమని చెప్పాలని మా ఫ్యామిలీ ఫ్రెండ్​ని నా దగ్గరకు పంపించాడు. అయినా నేను నిర్ణయం మార్చుకోలేదు. ఈ సారి మా నాన్న  అసంతృప్తిగా ఉన్నాడు. కానీ నా మనసు మారలేదు. పరిశోధన మీదే ధ్యాస పెట్టాను. ఎస్​ఆర్​ఎఫ్​ వచ్చాక ఫెలోషిప్​ 2,100 రూపాయలు వచ్చేది. అప్పుడు ట్యూషన్స్​ బంద్​ పెట్టి రీసెర్చ్​ మీద ఇంకా ఎక్కువ టైమ్​ కేటాయించాను. వెలిగిన విద్యుత్తేజం పీహెచ్​డీలో జాయిన్​ కాకముందే స్విట్జర్లాండ్​ సైంటిస్ట్​ లాంథనమ్,​ బేరియం, కాపర్​ ఆక్సైడ్​తో సూపర్​ కండెక్టింగ్​ మెటీరియల్​ తయారు చేసిండు. అమెరికన్​ సైంటిస్ట్​ పౌల్​ చూ దానిని లాంథనమ్, యుట్రియంతో రీప్లేస్​ చేసిండు. ఫిజిక్స్​ డిపార్ట్​మెంట్​లో నేను ఆ సూపర్​ కండెక్టివిటీ మెటీరియల్​ మీద స్టడీ చేశాను. పీహెచ్​డీ చేసే రోజుల్లో నేను రాసిన రీసెర్చ్​ పేపర్స్​ పద్దెనిమిది జర్నల్స్​లో పబ్లిష్​ అయ్యాయి. పీహెచ్​డీ అయిపోయిన తర్వాత యూజీసీ యంగ్​ సైంటిస్ట్​ ప్రాజెక్ట్​కి సెలెక్ట్​ అయ్యాను. ఆఫెలోషిప్​తో 1995లో ఓయూలోనే హై డెన్సిటీ ఉన్న మెటీరియల్​తో సూపర్​ కండెక్టివిటీ మెటీరియల్​ మీద పరిశోధన చేశాను. పీహెచ్​డీ, యంగ్​ సైంటిస్ట్​గా నేను చేసిన స్టడీ, నేను పబ్లిష్​ చేసిన రీసెర్చ్​ పేపర్స్​ చూసి జపాన్​ గవర్నమెంట్​ సూపర్​ కండెక్టింగ్​ రీసెర్చ్​ లేబరేటరీ (జపాన్) ఫెలోషిప్​కి సెలక్టయ్యాను. 8 జనవరి1996లో జపాన్​లో అడుగుపెట్టాను. పవర్​ జనరేషన్స్​లో తయారైన కరెంట్​ వినియోగదారులకే మొత్తం అందదు. సరఫరాలో కొంత వేస్ట్​ అవుతుంది. కరెంట్​ అలా వేస్ట్​ కాకుండా ఎక్కువ మొత్తంలో ఉపయోగించుకునేందుకు సూపర్​ కండెక్టర్స్​ ఉపయోగపడతాయి. అయితే ఈ సూపర్​ కండక్టర్స్​ని మెరుగుపరుస్తూ పవర్​ వేస్టేజ్​ని తగ్గించడం, సూపర్​ కండెక్టర్స్​ మెయింటినెన్స్​ని ఈజీగా ఉండేలా చేయడం కోసం సూపర్​ కండెక్టింగ్​ రీసెర్చ్​ లేబరేటరీ​లో రీసెర్చ్​ జరుగుతూ ఉండేది. నేనూ అందులో ఫెలోగా చేరాను. ఇంటర్నేషనల్​ సూపర్ కండెక్టింగ్​ ఇన్​స్టిట్యూట్​లో ఎవరైతే ముందుగా కొత్తది కనుగొంటే దాన్ని పేటెంట్​ చేసేవాళ్లు. యురోపియం, గిడిలోనియం, బేరియం కాపర్​ ఆక్సైడ్​తో కొత్త మెటీరియల్​ని డెవలప్​చేశాను. దీనికి పేటెంట్స్​ వచ్చాయి. ఫెలోగా నేను చేసిన వర్క్స్​ చూసి ఆ ఇన్​స్టిట్యూట్​ డైరెక్టర్​ సెకండ్​ రీసెర్చ్​ ఫెలోగా ప్రమోట్​ చేశారు. 2000 సంవత్సరంలో సీనియర్​ రీసెర్చ్​ ఫెలో అయ్యాను. 1998 నుంచి 2005 మధ్య కాలంలో అయిదు సార్లు జపాన్​ గవర్నమెంట్​ బెస్ట్​ సైంటిస్ట్ అవార్డ్​ ఇచ్చింది. పాతికేళ్ల ప్రవాసంలో… జపాన్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్స్​ని, యూనివర్సిటీలు చేసే ప్రాజెక్ట్స్​లో ఇండియన్​ స్టూడెంట్స్​ పాల్గొనేలా చేసే అవకాశం తీసుకున్నాను. ఐఐటీ, మరికొన్ని యూనివర్సిటీల్లో చదివే స్కాలర్స్​ కోసం జపాన్​ యూనివర్సిటీలు, రీసెర్చ్​ సెంటర్స్​తో కలిసి పనిచేసేలా ప్రాజెక్ట్స్​ని డిజైన్​చేస్తున్నాను. 24 ఏళ్లుగా వేలమంది ఇండియన్​ స్టూడెంట్స్​ జపాన్​ సంస్థల రీసెర్చ్​లో పాల్గొనే అవకాశం కల్పించాను. స్కూల్​ స్టూడెంట్స్​కి కూడా ఇలాంటి అవకాశం ఇప్పించాను. ఇంజినీరింగ్, సైన్స్​ స్టూడెంట్స్​తో కలిసి చేస్తున్న ఈ పరిశోధనలు ఇండియా, జపాన్​  రిలేషన్స్​ని పెంచాయి. చాలా ఇండియన్​ యూనివర్సిటీలకు గెస్ట్​ ఫ్యాకల్టీగా, అడ్వైజర్​గా ఉన్నాను. రీసెర్చి స్టడీస్​, ఎనాలసిస్​లతో జర్నల్స్, కాన్ఫరెన్స్​లలో ఇప్పటి వరకు 500కు పైగా పేపర్స్​ని ప్రజెంట్​ చేశాను.  అందుకే  ఈ ప్రవాస భారతీయ సమ్మాన్​ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు ఆనందాన్నిచ్చినా, ఎంతోమంది స్టూడెంట్స్​లను పరిశోధన వైపు నడిపించిన బాధ్యతే నాకు ఇంకా సంతోషాన్నిస్తోంది. ఎక్కడైనా బెస్టే! లిక్విడ్​ నైట్రోజన్​ దగ్గర పనిచేసే సూపర్​ కండక్టర్స్​ మెయింటెనెన్స్​ చాలా ఎక్కువ. అదే లిక్విడ్​ ఆక్సిజన్​ దగ్గర పనిచేసే సూపర్​ కండక్టర్స్​ మెయింటెనెన్స్​ చాలా తక్కువ. ఇప్పుడు లిక్విడ్​ ఆక్సిజన్​ దగ్గర పనిచేసే సూపర్​ కండెక్టర్స్​ని డెవలప్ ​చేస్తున్నాం. ఇవి రాకెట్​ టెక్నాలజీలోనూ ఎక్కువగా ఉపయోగపడతాయి. కరెంట్​ నష్టాన్ని తగ్గిస్తూ పోతే మనకు డబ్బు ఆదా కావడమే కాదు వనరుల వినియోగం, పొల్యూషన్​ తగ్గుతాయి. రైల్వేలు కూడా విద్యుత్​తో నడిచేవి ఉన్నాయి. సూపర్​ కండెక్టర్​తో తయారు చేసిన బేరింగుల తయారీ, వాటి మెయింటెనెన్స్​ గురించి రైల్వే టెక్నికల్​ ఇన్​స్టిట్యూట్​లో కొంత కాలం పనిచేశాను. అక్కడా బెస్ట్​ సైంటిస్ట్​ అవార్డు ఇచ్చారు. ఇలా ఎక్కడ పనిచేసినా బెస్ట్​ అనిపించుకున్నాను. 2011లో సుబరాయ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​టెక్నాలజీలో ప్రొఫెసర్​గా చేరాను. ఇప్పుడు ఇందులోనే వైస్​ ప్రెసిడెంట్​గా పనిచేస్తున్నాను.::: నాగవర్ధన్​ రాయల ఇవి కూడా చదవండి రక్తంలో పుట్టగొడుగులు మొలిచినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిల్లలను అద్దెకు తీసుకుని పెళ్లిళ్లకు వచ్చి ఏం చేస్తారంటే.. 20 మంది కిడ్నాపర్లు.. రూ.5 లక్షల డీల్ కేఆర్ఎంబీ జ్యూరిస్‌‌డిక్షన్‌‌.. వచ్చే నెలలో నోటిఫై!