వరంగల్ ‘మెడికవర్’లో హైరిస్క్ ప్రసవాలకు ప్రత్యేక వైద్యం

వరంగల్  ‘మెడికవర్’లో హైరిస్క్  ప్రసవాలకు ప్రత్యేక వైద్యం

హనుమకొండ, వెలుగు: హైరిస్క్ ప్రెగ్నెన్సీ, అకాల ప్రసవాల సందర్భాల్లో సమయానుకూలంగా ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల తల్లి, శిశువుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, వరంగల్ మెడికవర్  ఆస్పత్రిలో ప్రతేక్యంగా వైద్యం అందిస్తున్నట్లు హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. మంగళవారం మెడికవర్ ఆస్పత్రిలో నిర్వహించిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. 

ముందుగా హైదరాబాద్ మెడికవర్ విమెన్, చైల్డ్ హాస్పిటల్​కు చెందిన సీనియర్ నియోనటాలజిస్ట్ డా.రవీందర్ రెడ్డి, పీడియాట్రిక్ సర్జన్ డా.మధుమోహన్ మాట్లాడుతూ ప్రతి 10 మంది శిశువుల్లో చాలామందికి జన్మించిన తొలి గంటలోనే ప్రత్యేక నియోనేటల్ చికిత్స అవసరం అవుతోందన్నారు. ఇలాంటి వారికోసం హైదరాబాద్ మెడికవర్ ఉమెన్, చైల్డ్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో అత్యాధునిక ఎన్‌‌‌‌‌‌‌‌ఐసీయూ సదుపాయాలు, 24 గంటల నియోనటాలజీ సేవలు, పీడియాట్రిక్ సర్జరీ సపోర్ట్​ అందుబాటులో ఉన్నాయని వివరించారు.