ఒకేసారి నాలుగు దేశాలపై విరుచుకుపడిన ఇరాన్: ట్రంప్ చెప్పినా వినటం లేదంటూ గల్ఫ్ దేశాలు గగ్గోలు

ఒకేసారి నాలుగు దేశాలపై విరుచుకుపడిన ఇరాన్: ట్రంప్ చెప్పినా వినటం లేదంటూ గల్ఫ్ దేశాలు గగ్గోలు

అమెరికా చర్చలు జరుపుతున్నది.. ట్రంప్ నేరుగా మాట్లాడుతున్నాడు.. ఇరాన్ దిగివస్తుంది.. యుద్ధం ముగుస్తుంది.. అంతా సెట్ రైట్ అవుతుందని భావించిన గల్ఫ్ దేశాలకు ఇరాన్ ఊహించని షాక్ ఇచ్చింది. అమెరికా చెప్పేదేంటీ.. ట్రంప్ డిమాండ్లు పెట్టటం ఏంటీ అంటూ తెగించేసిన ఇరాన్ దేశం.. 2026, మార్చి 25వ తేదీ నాలుగు దేశాలపై ఒకేసారి విరుచుకుపడింది. 

ఇజ్రాయెల్ తో పాటు కువైట్, జోర్దాన్, బెహ్రయిన్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఆయిల్ డిపోలపై డ్రోన్లు, మిస్సైల్స్ తో విరుచుకుపడింది ఇరాన్. ఏకంగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టునే టార్గెట్ చేయటంతోపాటు.. జోర్దాన్, ఇజ్రాయెల్, బెహ్రయిన్ దేశాల్లోని ఆయిల్ డిపోలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ బీభత్సం చేసింది. ట్రంప్ చెప్పినా వినకుండా ఇరాన్ దాడులు చేయటంపై గల్ప్ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు ఇరాన్ తో చర్చలపై చేసిన వ్యాఖ్యల్లో ఒక్క శాతం కూడా నిజంలేదని ఇరాన్ రెవల్యూషినరీ గార్డ్స్ తేల్చి చెప్పేశారు. ట్రంప్ చెబుతున్నవన్నీ మాయమాటలేనని, యుద్ధం ఎప్పుడు ఆపాలని డిసైజ్ తామే చేస్తామని ఇరాన్ ప్రకటించింది. దీంతో అసలు యుద్ధాన్ని ఆపటం ఎలా అనే అయోమయంలో ట్రంప్ పడ్డారు. ఇరాన్ సర్వం కోల్పోయింది.. వారి దగ్గర ఏమీ మిగిలి లేవ్ అంటున్న ట్రంప్ కి ఇరాన్ గట్టి జవాబు ఇచ్చింది.

ఇరాన్ రెవల్యూషినరీ గార్డ్స్ 80వ రౌండ్ మిసైల్ అటాక్స్ స్టార్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఏకకాలంలో మిసైల్స్ తో దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్, కువైట్, జోర్డాన్, బెహ్రయిన్ పై బాంబుల వర్షం కొనసాగుతోంది. దీంతో దౌత్యపరమైన చర్చలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇరాన్ మిసైల్స్ వర్షం కురిపిస్తోంది అమెరికా మిత్రదేశాలపై. 

దీనికి ముందు ఇరాన్ జరిపిన దాడుల్లో ఇరాన్ పోర్టులు దెబ్బతినగా.. బహ్రెయిన్, యూఏఈ, కువైట్, ఇరాక్ సహా మరికొన్ని గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా బాలిస్టిక్ మిసైల్స్ పంపి తమ పవర్ ఏంటో ఇరాన్ చూపించింది. దీంతో గల్ఫ్ దేశాల పరిస్థితి సినిమాలో డైలాగ్ మాదిరిగి వీడిని ఎవడైనా ఆపండెహే అన్నట్లు తయారైంది ఇరాన్ విషయంలో.