
పంటి(దంతాలు) ఆరోగ్యం మన శరీర ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యకరమైన నోరు మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా అవసరం. ఆహారాన్ని తినడం, ఆస్వాదించేందుకు ఈజీగా ఉంటుంది. అలాంటి నోరు, నోటిలోని పళ్లు, చిగుళ్లు మొత్తంగా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే రోజుకు రెండు సార్లు పళ్లు తోముకోవడం ద్వారా నోటి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి.
చాలామంది నోటి ఆరోగ్యం బాగా లేదు.. ఏదో సమస్యతో బాధపడుతున్నామని చెబుతుంటారు.. నోటిలో అల్సర్లు, చిగుళ్లనుంచి రక్తకారడం, పంటినొప్పి,దవడ నొప్పి , నోరు ఎండిపోవడం వంటి సమస్యలున్నాయని అంటుంటారు.. కానీ సీరియస్ దృష్టి సారించరు. డాక్టర్లను సంప్రదించరు.. అయితే వీటిని నిర్లక్ష్యం చేస్తే సీరియస్ డెంటల్ సమస్యలకు దారి తీస్తుందంటున్నారు డాక్టర్లు. అదికాస్త మొత్తం శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు.
నోరు ఆరోగ్యంగా లేదు అనడానికి 7 సంకేతాలివే..
పంటి నొప్పి
అప్పడప్పుడు పంటి నొప్పి వస్తుంది.. దీనిని ఏమాత్రం విస్మరించకూడదు అంటున్నారు డాక్టర్లు. చల్లని డ్రింక్స్ తీసుకున్నప్పుడు జువ్వుమని లాగడం కూడా నిర్లక్ష్యం చేయకూడని దంత సమస్య. ఇది మీ పళ్లు క్రమంగా క్షీణించి పోతున్నాయడానికి సంకేతం. అంటే పంటిపై ఉండే పొర ఎనామిల్ ఇన్ ఫెక్షన్ సమస్య. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించి డెంటల్ ఫిల్లింగ్, రూట్ కెనాల్ వంటి చికిత్స తీసుకోవడం మంచిదంటున్నారు.
చిగుళ్ళలో రక్తస్రావం
బ్రష్ చేసేటప్పుడు కొద్దిగా రక్తం కారడం ప్రమాదకరం కాదు అని అనిపించవచ్చు. కానీ ఇది తరచుగా చిగుళ్ల వాపు లేదా చిగుళ్ల వ్యాధి ప్రారంభ దశల సంకేతం. దీనిని చిగురువాపు అని కూడా పిలుస్తారు. వాపు, సున్నితత్వం లేదా రక్తస్రావం కొనసాగితే, పీరియాంటైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది మీ దంతాలకు మద్దతు ఇచ్చే ఎముక,కణజాలాలను ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమయంలో చిగుళ్లపై శ్రద్ధ చాలా అవసరం.
హాలిటోసిస్
మీ నోటినుంచి చాలా కాలంగా దుర్వాసన వస్తున్నట్లయితే డాక్టర్ ను సంప్రదించాలి. దీనిని హాలిటోసిస్ అని పిలుస్తారు. దీనికి చాలా రకాల కారణాలున్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం నోటి పరిశుభ్రత లేకపోవడం.
మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహార కణాలు దంతాల చుట్టూ చేరిపోతాయి. వీటిని క్రమం తప్పకుండా బ్రష్ చేసి లేదా ఫ్లాష్ చేసి తొలగించాలి. లేకపోతే అవి దంతాలు, నాలుక, చిగుళ్లపై మందపాటి ఫలకంలా పేరుకుపోతాయి. దీంతో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా ఈ ఫలకం లోపల వృద్ధి చెందుతుంది.దుర్వాసనను విడుదల చేస్తుంది. కొన్నిసార్లు ఎంత బ్రష్ చేసినా లేదా మౌత్ వాష్ చేసినా ఎంతకూ దుర్వాసన పోదు. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ ని సంప్రదించాలి
దవడ నొప్పి..
ఆహారం తింటున్నపుడు దవడలో అసౌకర్యం, ముఖ్యంగా నమలడం, మాట్లాడేటప్పుడు ఇబ్బందిగా ఉంటే అది టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ సమస్య ఎదుర్కొంన్నారని అర్థం. TMJ రుగ్మతలు దంతాలు గ్రైండింగ్, ఒత్తిడి లేదా తప్పుగా అమర్చబడిన దంతాల వల్ల సంభవించవచ్చు.చికిత్స లేకుండా అవి తరచుగా తీవ్రమవుతాయి. డాక్టర్లను సంప్రదిస్తే దీనికి పరిష్కారం చూపుతారు. దీర్ఘకాలికంగా ఇలా ఉంటే మరింత సంక్లిష్టమైన దంత సమస్యలుగా మారతాయి.
నోరు ఎండిపోవడం..
మీ నోరు నిరంతరం లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన నోటికి చాలా ముఖ్యమైనది. నోరు పొడిబారడం అనేది తరచుగా వ్యాధి లేదా మందుల వల్ల వస్తుంది. ఇది అసౌకర్యంగా అనిపించనప్పటికీ మీ నోటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. పొడి నోరు ఎక్కువ ఆమ్లంగా ఉంటుంది. క్షయం అయ్యే అవకాశం ఉంది. అంటే మీకు దంత క్షయం లేదా దంతాలు ఊడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
నోరు పొడిబారుతుంటే పెదవుల్లో పగుళ్లు ,నోటి మూలల్లో పుండ్లు ఏర్పడటం..నాలుక గరుకుగా ,పొడిగా మారి మింగడానికి ,మాట్లాడటానికి ఇబ్బంది పడటం జరుగుతుంది. రుచి తెలియకుండా పోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
నోటి పూత..
అప్పుడప్పుడు నోటి పుండ్లు రావడం సర్వసాధారణం కానీ అవి ఒకటి లేదా రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే సీరియస్ గా తీసుకోవాలి. నయం కాని గాయాలు ఇన్ఫెక్షన్, పళ్లు శుభ్రం చేస్తున్నప్పుడు చికాకు, ఆహారం తీసుకుంటున్నప్పుడు ఇబ్బంది కలగవచ్చు.. ఇవి నోటి క్యాన్సర్ ప్రారంభ సంకేతాలను కూడా సూచిస్తాయి. డాక్టర్లను సంప్రదిస్తే..ఏ పుండ్లు సాధారణమైనవో పరిశీలించి మందులు ఇస్తారు.
నోటిలో చీము..
చీము అనేది చనిపోయిన కణజాలం..శారీరక ద్రవం ,చనిపోయిన సూక్ష్మజీవుల సమాహారం. నోటి చీము దంత గడ్డలలో పేరుకుపోతుంది. దంత గడ్డలు అంటే దంతాలు లేదా చిగుళ్ళ లోపల చీము పేరుకుపోవడం. ఇవి సాధారణంగా బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. ఇది చివరికి గడ్డలుగా మారుతుంది. చీము ఏర్పడినప్పుడు మింగడంలో ఇబ్బంది, తేలికపాటి జ్వరం, దుర్వాసన వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ప్రతిరోజూ బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ ,పుక్కిలించడం ద్వారా చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు. ఇది కొనసాగకుండా డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
కాబట్టి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యంగా లేకుండా మొత్తం శరీర ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. నోటికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించి చికిత్స చేసుకోవడం చాలముఖ్యం.