G20 Summit: అతిథులు ఎప్పుడు వస్తారు.. వారికి ఎవరు స్వాగతం పలుకుతారు

G20 Summit:  అతిథులు ఎప్పుడు వస్తారు.. వారికి ఎవరు స్వాగతం పలుకుతారు

సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జరిగే G20 సమావేశాలకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. వీవీఐపీల రాక సందర్భంగా కనీవిని ఎరగని రీతిలో భారీ భద్రత కట్టుదిట్టం చేశారు. వచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే G20 సమావేశాలకు వస్తున్న బైడెన్, రిషీ సునాక్ వంటి ప్రముఖులకు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు స్వాగతం పలకనున్నారు. 

G20 సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, బ్రిటన్ ప్రధాని రిషీ సునక్ వంటి ప్రముఖులు హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్ 8 సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.. జోబైడెన్ కు బీజేపీ ఎంపీ, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ ఆహ్వానం పలకనున్నారు. 

మరోవైపు G20 సమావేశాల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్-  రేపు భారత్ కు రానున్నారు. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆయనకు స్వాగతం పలకున్నారు. ఇంపీరియల్ హోటల్లో ఆంథోని బస చేయనున్నారు. 

G20 సమావేశాలకు  యూకె ప్రధాని రిషి సునక్ తోపాటు ఎన్ ఎస్ ఏ టిమ్ బారో కూడా సమ్మిట్ లో పాల్గొంటారు. ప్రధానిగా సునక్ కు ఇదే తొలి భారత పర్యటన. బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబె, బ్రిటన్ ప్రధాని సునక్ కు స్వాగతం పలకనున్నారు. 

వీరితో మొత్తం 40 దేశాల నుంచి జీ20 సమావేశాలకు వస్తున్న అతిథులకు బీజేపీనేతలు, కేంద్ర మంత్రులు ఆహ్వానం పలకనున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని-కి శోభా కరంద్లాజే.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా-కు దర్శన జర్దోష్,  దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు - రాజీవ్ చంద్రశేఖర్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా-ను నిత్యానంద్ రాయ్,  ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్- ను  అనుప్రియా పటేల్ స్వాగతం పలుకుతారు. 

జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్- కు  బి ఎల్. వర్మ,  మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్- కు శ్రీపాద్ నాయక్, సింగపూర్ పీఎం ధర్మన్ షణ్ముగరత్నంకు - ఎల్ మురుగన్, EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ - ప్రహ్లాద్ పటేల్  సాదర స్వాగతం పలుకుతారు. 

EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ -కు  ప్రహ్లాద్ పటేల్, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ -కు  శంతను ఠాకూర్,  చైనా ప్రతినిధి బృందానికి జనరల్ వీకే సింగ్ స్వాగతం పలకనున్నారు.