గగన్‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌కు హైదరాబాదీ ఫుడ్..కిచిడీ, చికెన్‌‌‌‌‌‌‌‌ నగెట్స్, మటన్‌‌‌‌‌‌‌‌ రోల్స్

గగన్‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌కు  హైదరాబాదీ ఫుడ్..కిచిడీ, చికెన్‌‌‌‌‌‌‌‌ నగెట్స్, మటన్‌‌‌‌‌‌‌‌ రోల్స్
  • ప్రత్యేక వంటకాలు తయారు చేస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ న్యూట్రిషన్​ సైంటిస్టులు
  • అంతరిక్షంలో ఉండే పరిస్థితులకు తగ్గట్టుగా సెమీ సాలిడ్​ ఆహార పదార్థాలు
  • నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోల్​కతాలో ఆస్ట్రోనాట్లపై మైక్రోగ్రావిటీ స్థాయిలో పరీక్షలు
  • తలకిందులుగా బెడ్​రెస్ట్​ పొజిషన్​లోనే ఫుడ్​ ఇచ్చి విశ్లేషించనున్న శాస్త్రవేత్తలు


హైదరాబాద్, వెలుగు: కిచిడీ, చికెన్​ నగెట్స్​, మటన్​ రోల్స్, పండ్ల రసాలు.. అందరూ తినేవే కదా కొత్తేముందని అనుకుంటున్నరా! అవును, అవన్నీ మనం కామన్​గా తినేవి, తాగేటివే. కానీ, అందులోనూ కొత్తదనం ఉన్నది. మనం ప్రతిష్టాత్మక గగన్​యాన్​ ప్రోగ్రామ్​ చేపట్టబోతున్నం కదా.. ఆ స్పేస్​ మిషన్​లో భాగంగా ఆస్ట్రోనాట్లను అంతరిక్షంలోకి పంపించడానికి సిద్ధమైతున్నం కదా.. వాళ్ల కోసం ప్రత్యేకంగా తయారు చేయబోతున్న ఫుడ్డే ఇది. కానీ, మనం నార్మల్​గా చేసుకున్నట్టుగా ఈ ఆహార పదార్థాలు ఉండవు. 

స్పేస్​లో పరిస్థితులకు తగినట్టుగా వాటిని తయారు చేయబోతున్నారు. అందుకు ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ మెడికల్​ రీసెర్చ్​లో భాగమైన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ న్యూట్రిషన్(ఎన్​ఐఎన్​) సైంటిస్టులు ఆస్ట్రోనాట్లు తీసుకునే ఫుడ్డుపై స్టడీ చేయబోతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఫుడ్​ ఐటెమ్స్​ను తయారు చేసి గగన్​యాన్​ మిషన్​ కోసం అందించనున్నారు. హైదరాబాద్​ అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది బిర్యానీయే.. ఇప్పుడు గగన్​యాన్​ కోసం పంపించే ఫుడ్​ కూడా గుర్తొచ్చేలా ఆ స్పేస్​ మిషన్​లో మన సిటీ, మన సైంటిస్టులు భాగం కాబోతున్నారు.

భూమ్మీది పరిస్థితులతో పోలిస్తే స్పేస్​లో పరిస్థితులు పూర్తి భిన్నమని అందరికీ తెలిసిందే. అంతరిక్షంలో పరిశోధనలు చేసే ఆస్ట్రోనాట్లు, సైంటిస్టుల హెల్త్​లోనూ తేడాలు వస్తుంటాయి. కాబట్టి వారికి మంచి పోషకాహారం ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ వంట కూడా చేసుకోలేని పరిస్థితులుంటాయి. కాబట్టే భూమ్మీది నుంచే వారికి కావాల్సినంత ఫుడ్డును తయారు చేసి ప్యాక్​చేసి పంపిస్తుంటారు. కానీ, ఆ ఫుడ్డు మనం వండుకుని తినేటటువుంటి ఆహారంలా మాత్రం ఉండదు. తేలిగ్గా విరిగిపోయే ఆహారాన్ని పంపిస్తే.. ఆన్​బోర్డ్​ సిస్టమ్స్ పై పడి మిషన్​ ఫెయిలయ్యే ప్రమాదం ఉంది. అందుకే అటు గట్టి ఫుడ్​ కాకుండా.. ఇటు మరీ లిక్విడ్​ ఫుడ్​ కాకుండా ఉండేలా సైంటిస్టులు జాగ్రత్తగా పడుతుంటారు. అందులో భాగంగానే సైంటిస్టులు స్పేస్​లో ఆస్ట్రోనాట్లకు సెమీ సాలిడ్​లో ఎలాంటి ఫుడ్​ ఇస్తే బాగుంటుందన్న దానిపై స్టడీ చేయబోతున్నారు.

మైక్రోగ్రావిటీ టెస్టులు..

గగన్​యాన్​లో భాగంగా స్పేస్​లోకి వెళ్లే ఆస్ట్రోనాట్లకు సూక్ష్మపోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్​ డీ ఎక్కువగా అందే ఫుడ్​పైనే సైంటిస్టులు దృష్టి పెడుతున్నారు. వెజ్​, నాన్​వెజ్​ ఫుడ్స్​లో సోడియం స్థాయిలు నియంత్రణలో ఉండేలా చూసుకుంటున్నారు. స్పేస్​లో ఉంటున్నప్పుడు ఫుడ్​ విషయంలో కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. దానిని నివారించేలా ఫైబర్​ ఉండే ఆహారాన్నీ ఎంతివ్వాలనేదానిపై పరిశోధనలు చేస్తున్నారు. మన ఇండియన్​ ఫుడ్స్​తో పాటు.. కాంటినెంటల్​ ఫుడ్​పైనా ఫోకస్​ పెట్టారు. ఆ తయారు చేసిన ఆహారాన్ని ఆస్ట్రోనాట్లకు ఇచ్చి పరీక్షించి చూడనున్నారు. 

మైక్రోగ్రావిటీలో ఇలాంటి ఫుడ్​ తీసుకున్న ఆస్ట్రోనాట్లు ఎలా ఉంటారన్న అంశాలనూ విశ్లేషించనున్నారు. అందులో భాగంగా నవంబర్​లో కోల్​కతాలో గగన్​యాన్​ ఆస్ట్రోనాట్లకు మైక్రోగ్రావిటీలో ఈ ఫుడ్​ను ఇచ్చి ఎన్​ఐఎన్​ సైంటిస్టులు పరీక్షించనున్నారు. 14 రోజుల పాటు ఆస్ట్రోనాట్లు తలకిందులుగా బెడ్​ రెస్ట్​ పొజిషన్​లో ఆహారం తీసుకుంటే ఎలాంటి రియాక్షన్లు వస్తాయో విశ్లేషించనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా టిల్టెడ్​ బెడ్స్​నూ ఇప్పటికే తయారు చేశారు.

 ఆ పొజిషన్​లోనే రోజువారీ పనులు చేసుకుంటూనే.. పైకి లేవకుండానే ఫుడ్​ తినడం, వాష్రూమ్స్​కు వెళ్లడం వంటి వాటిని సిమ్యులేషన్​ ద్వారా ఆస్ట్రోనాట్లపై స్టడీ చేయనున్నారు. ఫుడ్​ తయారు చేయడమే కాదు.. స్పేస్​లో ఆ ఫుడ్​ పాడైపోకుండా చూసుకోవడమూ ముఖ్యమే. అందుకే ఫుడ్​ పాడైపోకుండా వాడాల్సిన ప్రిజర్వేటివ్స్​ను ఎంతమోతాదులో కలపాలి, ఫుడ్​ టేస్ట్​ మారకుండా ఫ్రీజ్​ డ్రైయింగ్​, ఇన్​ఫ్రారెడ్​ డ్రైయింగ్​ వంటి పద్ధతుల ద్వారా స్టడీస్​ చేయనున్నారు. 

‘‘చాలా కాలం పాటు పనిచేయకుండా ఉంటే ఎముక బలహీనమైపోతుంది. కండరాల శక్తి తగ్గుతుంది. కాబట్టి పోషకాల నిర్వహణ చాలా కీలకం. అందువల్ల స్పేస్​లో ఉన్నట్టుగానే ఇక్కడా అలాంటి పరిస్థితులను సృష్టించి వారికిచ్చే ఆహారంపై పరిశోధనలు చేస్తున్నం’’ అని  ఎన్​ఐఎన్​ సైంటిస్ట్​ ఒకరు‘వెలుగు’తో  పేర్కొన్నారు.