అద్దె ఇంట్లో ఇష్టమెుచ్చినట్లు మార్పులు చేస్తున్నారా..? ఆగండి.. చట్టం ఏం చెబుతోందో తెలుసా..?

అద్దె ఇంట్లో ఇష్టమెుచ్చినట్లు మార్పులు చేస్తున్నారా..? ఆగండి.. చట్టం ఏం చెబుతోందో తెలుసా..?

ఈ రోజుల్లో జీవనోపాధిలో భాగంగా కోట్ల మంది ప్రజలు తమ సొంత గ్రామాలు వీడిచి అనేక పట్టణాలకు జాబ్స్ కోసం వలస వెళుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కుటుంబాలకు అద్దె ఇళ్లే దిక్కు. అయితే కొందరు ఓనర్స్ తమకు తెలియకుండా కనీసం గోడకు ఒక మేకు కూడా కొట్టొద్దని వార్నింగ్ ఇస్తుంటారు. మరికొందరు మాత్రం అద్దెదారుడి అవసరాలకు తగినట్లుగా మార్పులు చేసుకోనిస్తుంటారు. అయితే అద్దె ఇంట్రో టీవీ స్టాండ్ గోడకు ఫిక్స్ చేయటం నుంచి వాల్ పేపర్స్ అతికించటం వరకూ చట్ట ప్రకారం ఎలాంటి వెసులుబాట్లు ఉంటాయనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం రండి... 

కొత్త అద్దె ఇంట్లోకి అడుగుపెట్టగానే ప్రతి ఒక్కరికీ వచ్చే ఫస్ట్ అనుమానం గోడకి ఆ కలర్ వేస్తే ఎలా ఉంటుంది? అక్కడ ఒక క్రేజీ వాల్‌పేపర్ అంటిస్తే? ఆ మూలన ఒక చిల్-అవుట్ జోన్ క్రియేట్ చేస్తే?" అబ్బా.. ఊహే ఎంత బాగుందో కదా. ఇల్లు అద్దెదైనా.. అందులో ఉండే లైఫ్ మనది. అందుకే దాన్ని మన టేస్ట్‌కి తగ్గట్టు మార్చుకోవాలని అనుకోవడం కామన్. కానీ ఆగండి బాసూ.. అలా మన ఇష్టమొచ్చినట్టు చేస్తే ఓనర్ "ఖాళీ చేయండి" అంటూ నోటీస్ పట్టుకొచ్చే ఛాన్స్ ఉంది తెలుసా. ఇలా అద్దె ఇంట్రో మాడిఫికేషన్స్ గురించి చట్టం ఏం చెబుతోంది? మనకున్న రైట్స్ ఏంటి? తెలుసుకుని బిహేవ్ చేయటం బెటర్. 

ద గ్రేట్ 'ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882':
మన దేశంలో ఓనర్ల ఆటలు, అద్దెదారుల పాటల మధ్య బ్యాలెన్స్ కోసమే ఒక పవర్‌ఫుల్ చట్టం ఉంది. అదే సెక్షన్ 108. దీని ప్రకారం మీరు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇల్లు ఎలా తీసుకున్నారో.. అలాగే (నార్మల్ వేర్ అండ్ టియర్ మినహాయించి) అప్పగించాల్సి ఉంటుందని చట్టం చెబుతోంది. కానీ ఇందులోనే ఒక క్రేజీ ట్విస్ట్ ఉంది.

*సెక్షన్ 108(h) పవర్: మీరు లీజ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు, సొంత ఖర్చులతో పెట్టుకున్న ఏ ఫిక్సేచర్లనైనా తిరిగి తీసేసుకునే హక్కు మీకుంది. కాకపోతే.. తీసేసాక ఆ గోడలను, ఇంటిని మళ్లీ పాతపద్ధతిలోనే క్లీన్‌గా ఉంచాలన్నమాట.

చట్టం అనుమతించిన మాడిఫికేషన్స్..
అద్దెకు ఉంటున్న ఇల్లు బోర్ కొట్టకుండా.. మీ పర్సనాలిటీకి తగ్గట్టు మీరు బిందాస్‌గా ఈ కింది మార్పులను మాత్రం చేసుకోవచ్చు:
1. గ్యాడ్జెట్స్ & అప్లయెన్సెస్: టీవీ వాల్ మౌంట్స్, ఏసీలు, వాటర్ ప్యూరిఫైయర్లు, గీజర్ల ఏర్పాటు. 
2. డెకర్ & ప్రైవసీ: విండో కర్టెన్లు, బ్లైండ్స్, లుక్ పెంచే పెద్ద అద్దాలు, క్లాక్స్ అద్దె ఇంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు.
3. గోడల ముస్తాబు: గోడలకు ఈజీగా ఊడిపోయే వాల్ స్టిక్కర్లు, రిమూవబుల్ వాల్‌పేపర్లు అతికించుకోవచ్చు అద్దెకు దిగిన ఇంట్లో.
4. స్పేస్ మేనేజ్‌మెంట్: తాత్కాలికంగా పెట్టే వుడెన్ లేదా గ్లాస్ పార్టిషన్లు, కదిలించే వీలుండే ర్యాక్స్ ఏర్పాటు చట్టం అనుమతిస్తోంది. 

గ్రే ఏరియా జాగ్రత్త గురూ..
చిన్న మేకు కొట్టడానికి, పెద్ద డ్రిల్లింగ్ మెషీన్‌తో రంధ్రం చేయడానికి చాలా తేడా ఉంది. అలాగే గోడకి మురికి అంటిందని సేమ్ కలర్ పెయింట్ వేస్తే ఓకే కానీ.. ఓనర్‌కి చెప్పకుండా టాక్సిక్ గ్రీన్, హాట్ పింక్ లాంటి కలర్ వేస్తే మాత్రం లీగల్ చిక్కులు తప్పవు. పర్మనెంట్ మార్పులు చట్టవిరుద్ధం.

అన్నింటికన్నా ముఖ్యమైనది అద్దెకు దిగే ఇంట్లో ఓనర్ తో రాతపూర్వకంగా అగ్రిమెంట్ చేసుకోవటం. మీరు అద్దె ఇంట్లో ఏదైనా క్రేజీ మార్పులు చేయాలనుకుంటే.. ఓనర్‌తో మాట్లాడి దాన్ని రాతపూర్వకంగా రికార్డ్ చేయండి. వాట్సాప్ చాట్ లేదా అగ్రిమెంట్ పేపర్‌పై సంతకం ఉంటే.. రేపొద్దున సెక్యూరిటీ డిపాజిట్ కట్ చేసేటప్పుడు ఓనర్ల నోళ్లు మూయించొచ్చు ఈ సాక్ష్యాలతో. సో చట్టాన్ని గౌరవిస్తూనే.. మీరు అద్దెకు ఉంటున్న ఇంటిని ఒక స్వర్గధామంగా మార్చేసుకోండి.