హాట్‌ కేక్‌ లా..!: కలబంద జ్యూస్‌ కి మస్త్ గిరాకీ

హాట్‌ కేక్‌ లా..!: కలబంద జ్యూస్‌ కి మస్త్ గిరాకీ

ఏ పార్క్ దగ్గర చూసినా కలబంద, ఇతర ఆయుర్వేద జ్ యూస్ స్టా ల్స్‌‌‌‌ కనిపిస్తున్నాయి. ఇందిరాపార్కు దగ్గరైతే 5 నుం చి 10 రకాల ఆయుర్వేద డ్రింక్స్ అప్పటికప్పుడే తయారు చేసి ఇచ్చే టెంపరరీ షాపులు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు చాలా మంది వీటిని తాగుతున్నారు. అంతేకాకుండా వీటి ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. కలబంద జ్యూస్‌‌‌‌ 30 రూపాయలకే దొరుకుతుంది. ఈ స్టాల్స్‌‌‌‌ యజమానులు రోజుకి రెండు వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.

కలబంద జ్యూస్ తాగడం వల్ల 20 రకాల అమైనో యాసిడ్లు, బార్బలోయిన్ అనే సి–గ్లూ కోసైడ్‌ లు, విటమిన్లు, మాం గనీస్, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం వంటివి శరీరానికి అందుతాయి.

కలబంద హాట్‌ కేక్‌ లా..

స్టాల్‌లో రోజూ కనీసం వంద మంది కలబంద, వీట్‌ గ్రాస్ జ్యూస్‌‌‌‌లు తాగుతారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే మంచి ఆదరణ ఉంది. జ్యూస్‌‌‌‌లకు కావాల్సిన గ్రాస్, కలబందలను పక్క జిల్లాల్లో రైతుల నుంచి తీసుకొస్తున్నాం.

 – జ్యోతి, ఆయుర్వేద స్టాల్ నిర్వాహకురాలు